2024 Upcoming Movies : 2024లో మరో రెండు నెలలు మాత్రమే ఉన్నాయి. అయితే ఈ రెండు నెలల్లో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ నుంచి భారీ యాక్షన్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ సినిమాలపై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో అల్లు అర్జున్ 'పుష్ప- 2', సూర్య 'కంగువా', అజయ్ దేవగణ్ 'సింగం అగైన్' సహా పలు భారీ బడ్జెట్ చిత్రాలు ప్రేక్షకులను పలకరించనున్నాయి. ఇవి ఇండియన్ బాక్సాఫీస్‌తోపాటు వరల్డ్‌వైడ్‌గా పలు రికార్డులు బ్రేక్ చేసే ఛాన్స్ ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఆ సినిమాలపై ఓ లుక్కేద్దాం!
పుష్ప-2 : అల్లు అర్జున్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా సినీప్రియులు ఎదురుచూస్తున్న చిత్రం 'పుష్ప 2'. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పుష్పకు సీక్వెల్‌గా రానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రపంచస్థాయిలో పెద్ద విజయం సాధిస్తుందని భావిస్తున్నారు.
కంగువా : తమిళ దర్శకుడు శివ దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కిన చిత్రం 'కంగువా'. రెండు భాగాలుగా ఇది రానుంది. ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమా కోసం సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ 14న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాపై కూడా ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి.
సింగం అగైన్ : తెరపై మరోసారి బాజీరావ్ సింగమ్ పాత్రలో తనదైన యాక్షన్ హంగామాతో ప్రేక్షకులను అదరగొట్టడానికి సిద్ధమవుతున్నారు బాలీవుడ్ కథానాయకుడు అజయ్ దేవగణ్. ఆయన, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'సింగమ్ అగైన్'. రోహిత్ శెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. దీపావళి కానుకగా ఈ సినిమా నవంబరు 1న దియేటర్లలో విడుదల కానుంది. భారీ తారాగణం ఉన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో పెద్దఎత్తున అంచనాలు ఉన్నాయి.
భూల్ భులయ్యా 3 : బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో నటించిన 'భూల్ భులయ్యా 2' మంచి విజయాన్ని సాధించింది. దీంతో 'భూల్ భులయ్యా 3'తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది చిత్రబృందం. ఈ మూవీ కూడా దీపావళి కానుకగా నవంబరు 1న విడుదల కానుంది. అజయ్ దేవగణ్ మూవీ సింగం అగైన్ తో పోటీ పడనుంది.
బేబీ జాన్ : వరుణ్ ధావన్ హీరోగా రానున్న యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ 'బేబీ జాన్'’. కీర్తి సురేశ్ కథానాయిక. ఈ పవర్ ప్యాక్డ్ యాక్షన్ చిత్రాన్ని కాలీస్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఛావా : మరాఠా రాజు శంభాజీ జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కిన మూవీ 'ఛావా'. ఇందులో విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాను లక్ష్ణణ్ ఉటేకర్ తెరకెక్కిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ మూవీ డిసెంబరు 6న విడుదల కానుంది.
క్రేవెన్ ద హంటర్ : ఆరోన్ టేలర్ నటించిన హాలీవుడ్ యాక్షన్ సినిమా 'క్రేవెన్ ద హంటర్'. ‘ఈ సినిమా డిసెంబరు 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వనుంది. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
TFIలోనే తొలి సినిమాగా రికార్డ్- ఇదీ 'పుష్ప రాజ్' బ్రాండూ!
రాజమౌళి ఇన్స్పిరేషన్తో 'కంగువా' మూవీ! - అందుకే రెండేళ్లు పట్టింది : హీరో సూర్య