ETV Bharat / state

హైదరాబాద్​లోని బాణసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం - పదికి పైగా వాహనాలు దగ్ధం

హైదరాబాద్​లోని అబిడ్స్‌ పరిధిలోని బొగ్గులకుంటలో అగ్నిప్రమాదం - బాణసంచా దుకాణంలో భారీగా ఎగిసిపడుతున్న మంటలు - పక్కనున్న హోటల్‌కు వ్యాపించిన మంటలు - ఇప్పటికే పదికి పైగా వాహనాలు దగ్ధం- ఓ మహిళకు గాయాలు

FIRE ACCIDENT IN ABIDS
FIRE ACCIDENT AT BOGGULKUNTA (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Updated : 2 hours ago

Massive Fire Accident at Abids in Hyd : హైదరాబాద్‌ అబిడ్స్‌ పరిధిలోని బొగ్గులకుంటలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. పక్కనున్న హోటల్‌కు మంటలు వ్యాపించడంతో ఆందోళన నెలకొంది. మూడు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.

ఇప్పటికే పదికి పైగా వాహనాలు దగ్ధమయ్యాయి. దేవాదాయశాఖ కార్యాలయానికి సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. భారీ పేలుడు శబ్దాలతో మంటలు ఎగసిపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఓ మహిళకు గాయాలు కాగా ఆమెను చికిత్స నిమిత్తం అంబులెన్సులో ఆస్పత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు.

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.