Ind W vs Nz W 2nd ODI 2024: న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్ రెండో మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఓడింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియాపై కివీస్ 76 పరుగుల తేడాతో నెగ్గింది. 260 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియా ఓవర్లకే ఆలౌటైంది. రాధా యాదవ్ (48 పరుగులు) టాప్ స్కోరర్. కివీస్ బౌలర్లలో తహుహు, సోఫీ డివైన్ చెరో 3, కర్సన్, జెస్ కిర్ తలో 2 వికెట్లు దక్కించుకున్నారు.
ఛేజింగ్‌లో టీమ్ఇండియాకు తొలి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ నాలుగో బంతికే స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (0) పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరింది. ఆ తర్వాత కాసేపటికే మరో ఓపెనర్ షఫాలీ వర్మ (11 పరుగులు) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. ఇక అక్కడ్నుంచి టీమ్ఇండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. యస్తికా భాటియా (12 పరుగులు), జెమిమా రోడ్రిగ్స్ (17 పరుగులు) హర్మన్‌ప్రీత్ కౌర్ (24 పరుగులు), హసబిన్స్ (15 పరుగులు) వరుసగా ఔటయ్యారు.
పోరాడిన రాధ
భారత్ 108కే 8 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో టీమ్ఇండియా 125 పరుగుల చేయడం కూడా కష్టమే అనిపించింది. కానీ, రాధా యదవ్ అద్భుతంగా పోరాడింది. సైమా ఠాకూర్ (29 పరుగులు)తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 70 పరుగులు జోడించింది. భారత్ ఇన్నింగ్స్‌లో ఇదే పెద్ద భాగస్వామ్యం. వీళ్లిద్దరూ పోరాడి ఓటమి అంతరాన్ని తగ్గించారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 259-9 పరుగులు చేసింది. కెప్టెన్ సోఫీ డివైన్ (79 పరుగులు), సుజీ బీట్స్ (58 పరుగులు) హాఫ్ సెంచరీలతో రాణించారు. మ్యాడీ గ్రీన్ (42 పరుగులు), జార్జియా (41 పరుగులు) ఆకట్టుకున్నారు. ఇక టీమ్ఇండియా బౌలర్లలో రాధా యాదవ్ 4, దీప్తి శర్మ 2, సైమ ఠాకూర్, ప్రియా మిశ్ర తలో 1 వికెట్ దక్కించుకున్నారు.
Captain @ImHarmanpreet makes the most off the free-hit with a cracking SIX 💥#TeamIndia 54/3 after 11 overs in the chase
— BCCI Women (@BCCIWomen) October 27, 2024
Live - https://t.co/2sqq9BsXur#INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/4vjLBBT2J4
కాగా, ఇదే సిరీస్‌లో తొలి వన్డేలో భారత్ 59 పరుగుల తేడాతో నెగ్గింది. ఇక తాజాగా రెండో మ్యాచ్‌లో కివీస్ విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ 1- 1తో సమం అయ్యింది. ఇక ఇరుజట్ల మధ్య చివరి మ్యాచ్ అక్టోబర్ 29న జరగనుంది.
కివీస్‌పై భారత్ ఘన విజయం- 59 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ
భారత జట్టు నుంచి స్టార్ వికెట్ కీపర్ ఔట్! - ఇంటర్ పరీక్షల కోసం వన్డే సిరీస్‌కు దూరం!