ETV Bharat / entertainment

మోక్షజ్ఞకు జోడీగా స్టార్ హీరోయిన్ కూతురు- ఎవరో తెలుసా? - MOKSHAGNA DEBUT HEROINE

మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై బజ్- స్టార్ నటి కూతురే హీరోయిన్!​

Mokshagna Debut Heroine
Mokshagna Debut Heroine (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 27, 2024, 6:55 PM IST

Mokshagna Debut Heroine : నందమూరి బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ - ప్రశాంత్ వర్మ కాంబోలో సినిమాపై రోజుకో బజ్ క్రియేట్ అవుతోంది. ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి సినిమా ఎలా ఉండబోతుందా? అని నందమూరి అభిమానుల్లో భారీగా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో మోక్షు డెబ్యూ మూవీలో హీరోయిన్​ గురించి ఓ క్రేజీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మోక్షజ్ఞ మూవీలో హీరోయిన్​గా ఓ స్టార్ హీరోయిన్ కూతురు నటిస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రాశి థడాని. ఈ యంగ్ బ్యూటీ మోక్షుతో రొమాన్స్ చేయనుందని వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై మేకర్స్ నుంచి ఎటువంటి క్లారిటీ లేదు. అయినప్పటికీ మోక్షజ్ఞకు జోడీగా రాశి కనిపించనున్నారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. మోక్షజ్ఞ పక్కన నటించే హీరోయిన్ కోసం మేకర్స్ వెతుకున్నారు. ఈ క్రమంలో ఇలాంటి వార్తలు మరింత ఊపందుకోవడం గమనార్హం.

గ్రాఫిక్స్ మాయాజాలం
మోక్షజ్ఞ- ప్రశాంత్ వర్మ కాంబోలో ఇతిహాసాల స్ఫూర్తితో సోషియో ఫాంటసీ చిత్రంగా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. హను- మాన్ లానే ఈ మూవీలోని భారీ గ్రాఫిక్స్ ఉంటుందని సమాచారం. అలాగే ఈ మూవీలో హీరో బాలకృష్ణ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.

సినిమా విషయానికొస్తే, ఈ చిత్రాన్ని లెజెండ్‌ ప్రొడక్షన్స్‌ తో కలిసి ఎస్‌.ఎల్‌.వి.సినిమాస్‌ బ్యానర్ పై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ కుమార్తె తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఇతిహాసాల స్ఫూర్తితో సోషియో ఫాంటసీ చిత్రంగా రూపొందుతోంది. బాలయ్య విజన్‌కు అనుగుణంగా, చిరస్మరణీయంగా నిలిచిపోయేలా ఈ చిత్రం ఉంటుందని సినీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే మోక్షజ్ఞ నటన, ఫైట్లు, డ్యాన్స్‌ ల్లో శిక్షణ తీసుకుని ప్రత్యేకంగా సన్నద్ధమయ్యారట.

ఆ రోజే మూవీ స్టార్ట్
ప్రశాంత్ వర్మ- మోక్షు కాంబోలో మూవీని పట్టాలెక్కించేందుకు మేకర్స్ రెడీ అయినట్లు సమాచారం అందుతోంది. మూవీ ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని, చిత్రాన్ని డిసెంబర్ 2న లాంఛ్ చేయాలని ప్లాన్ చేస్తోందట. డిసెంబర్ 2న క్లాప్ కొట్టి రెగ్యులర్ షూట్‌కు వెళ్లేందుకు దర్శకుడు ప్రశాంత్ వర్మ షెడ్యూల్ ప్రీపేర్ చేస్తున్నారని తెలుస్తోంది.

మోక్షజ్ఞ సినిమా షూట్​ షురూ అయ్యేది అప్పుడే!

మోక్షజ్ఞ, ప్రశాంత్ వర్మ సినిమా - మొదటి అడుగు​ పడింది అక్కడే! - Mokshagna Prasanth Varma

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.