national

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు - సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం

By ETV Bharat Telangana Team

Published : Aug 31, 2024, 1:05 PM IST

Singareni Coal Production In Bhadradri
Rain Effect on Singareni Coal Production In Bhadradri (ETV Bharat)

Rain Effect on Singareni Coal Production In Bhadradri : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి ఏరియా కోయగూడెం ఉపరితల గనిలో ఉదయం నుంచి కురుస్తున్న వర్షంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. శుక్రవారం నుంచి కురుస్తున్న వర్షంతో 5 టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లగా, శనివారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షం ప్రభావంతో బొగ్గు ఉత్పత్తి ఓవర్ బర్డెన్ పనులు నిలిచిపోయాయి. ఇల్లందుతో పాటు గుండాల, ఆళ్లపల్లి ఏజెన్సీ ప్రాంతాల్లోనూ వర్షాలతో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. గుండాల మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో గుండాల కొడవటంచ ప్రధాన రహదారిపై ఏడు మెలికల వాగు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీని ప్రభావంతో పలు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించలేక ఇబ్బందులు పడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details