national

By ETV Bharat Telangana Team

Published : Jun 22, 2024, 6:40 AM IST

ETV Bharat / snippets

హైదరాబాద్ నగరంలో వరుస హత్యలు - తనిఖీలు ముమ్మరం చేసిన పోలీసులు

Police Checking at Old City
Police Checking in Hyderabad (ETV Bharat)

Police Checking in Hyderabad : హైదరాబాద్‌ పాతబస్తీలో ఇటీవల వరుస హత్యల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. తనిఖీలు ముమ్మరం చేశారు. సౌత్ జోన్, వెస్ట్ జోన్‌, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ జోన్లలోని అన్ని పోలీస్​ స్టేషన్​ పరిధుల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. హుమాయున్ నగర్, టోలీచౌకి, ఆసిఫ్ నగర్, మల్లేపల్లి, హబీబ్ నగర్, ఫస్ట్ లాన్సర్‌లో తనిఖీలు చేశారు. రాత్రి ఆవారాగా తిరుగుతున్న వారిని ఆపి వివరాలు తీసుకున్నారు. వాహనాలు తనిఖీ చేశారు. సరైన సమాధానం చెప్పని వారిని పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

Police Checking at Old City: ద్విచక్ర వాహనాలపై గుంపులుగా సంచరిస్తున్న వారిని, సమయానికి మించి దుకాణాలు నిర్వహిస్తున్న యజమానులను పోలీసులు హెచ్చరించారు. టోలీచౌకిలోని ఓ పాన్‌షాపులో నిషేధిత గుట్కా ప్యాకెట్లు దొరికాయి. పాన్‌షాపును సీజ్ చేసి దుకాణదారుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక డ్రైవ్‌లు ఇంకా కొనసాగుతుంటాయని అదనపు డీసీపీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details