ETV Bharat / offbeat

దుస్తులపై మొండి మరకలు పోవట్లేదా? - ఇలా ఉతికితే ఇట్టే మాయమైపోతాయ్​! - How To Remove Stains From Clothes

How To Remove Stains From Clothes: దుస్తులపై పడిన కొన్ని మరకలు ఎంత రుద్దినా సరే వదలవు. అయితే.. కొన్ని చిట్కాలు పాటించడం వల్ల.. ఆ మరకలను ఈజీగా తొలగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

How To Remove Stains From Clothes
How To Remove Stains From Clothes (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Oct 3, 2024, 5:09 PM IST

How To Remove Stains From Clothes: మనం ఎంతో ఇష్టంగా కొనుక్కున్న దుస్తులపై మరకలు పడితే చాలా బాధ పడతాం. ఇందులో కొన్ని మరకలు ఉతికితే పోతాయి గానీ.. మరికొన్ని మాత్రం ఎంత ప్రయత్నించినా వదలవు. అయితే.. ఈ చిట్కాలు ప్రయత్నిస్తే ఎలాంటి మొండి మరకనైనా ఈజీగా వదిలించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం..? ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

  • మనకు అనుకోకుండా దెబ్బలు తగిలినప్పుడు ఆ రక్తం దుస్తుల మీద పడుతుంది. ముఖ్యంగా మహిళలు అయితే పీరియడ్స్‌ టైమ్‌లో ఈ మరకలు సాధారణంగానే అంటుతాయి. వీటిని వదిలించడానికి.. హైడ్రోజన్ పెరాక్సైడ్ బాగా పనిచేస్తుందట. రక్తం మరక మీద హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి నానబెట్టిన తర్వాత డిటర్జెంట్ సోప్‌తో ఉతికితే మరకలు పోతాయని నిపుణులు చెబుతున్నారు.
  • మనం వివిధ పనులు చేసే సమయంలో దుస్తులపై ఇనుప తుప్పు మరకలు పడుతుంటాయి. ఇలాంటప్పుడు అర బకెట్ నీళ్లలో ఒక టేబుల్ స్పూన్ పొడి ఉప్పు వేసి దుస్తులను నానబెట్టాలట. ఆ తర్వాత మరకలపై నిమ్మరసం వేసి డిటర్జెంట్ సబ్బుతో బాగా ఉతికితే మరకలు పోతాయని నిపుణులు చెబుతున్నారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా తుప్పు మరకలను తొలగించడానికి బాగా పనిచేస్తుందని వివరించారు.
  • తినేటప్పుడు పొరపాటున వివిధ ఆహార పదార్థాలు బట్టలపై పడుతుంటాయి. ఇలానే కెచప్ మరక పడితే దాన్ని డిటర్జెంట్​తో ఉతికితే సరిపోతుందని.. బ్రష్​ను ఉపయోగించి మరక ఉన్న చోట రుద్దితే మరక వెంటనే తొలగిపోతుందని అంటున్నారు. చాక్లెట్ మరకలు పడితే బట్టల సోడా కలిపిన నీటిలో మరకను నానబెట్టి.. తర్వాత డిటర్జెంట్​తో ఉతికితే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
  • ఇంకా పచ్చడి మరకలు పడితే వెనిగర్ లేదా నిమ్మరసంలో మరకను ముంచి కాసేపు ఉంచి.. ఆ తర్వాత డిటర్జెంట్​తో క్లీన్ చేస్తే సరిపోతుందని నిపుణలు తెలిపారు.
  • ఒకవేళ దుస్తులపై లిప్​ స్టిక్ మరకలు పడితే దానిపై గ్లిజరిన్ రాసి అరగంట తర్వాత ఉతకాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మరక సులభంగా పోతుందని వివరించారు. మరకలపై నిమ్మకాయ ముక్కను రుద్దడం వల్ల ప్రభావవంతంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.
  • విద్యార్థులు, ఉద్యోగులు విధులు నిర్వర్తించే క్రమంలో బట్టలపై ఇంక్‌ మరకలు పడుతుంటాయి. ఇలాంటప్పుడు మరకలపై పేపర్‌ టవల్‌తో అద్ది, తర్వాత హెయిర్‌ స్ప్రే చల్లి.. కాసేపటి తర్వాత ఉతికితే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

NOTE: పైన పేర్కొన్న అంశాలు పలువురు నిపుణులు, పరిశోధనలు ప్రకారం అందించినవే. వీటిని పాటించడం, పాటించకపోవడం వారి వ్యక్తిగత విషయం.

ఇల్లు క్లీన్​ చేసే పని పెట్టుకున్నారా? - "బేకింగ్​ సోడా" మంత్రం వేయండి - చిటికెలో క్లీన్ అయిపోతుంది! - Baking Soda Cleaning Tips

దుస్తులపై రక్తం మరకలా? - ఈ టిప్స్​ పాటిస్తే చిటికెలో పోయి కొత్త వాటిలా మెరుస్తాయి! - How to Remove Blood Stains

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.