national

గూగుల్ పే కొట్టు - దొంగను విడిచిపెట్టు - సెల్​ఫోన్ చోరుడికి సహకరించిన పోలీసులు

By ETV Bharat Telangana Team

Published : Jul 30, 2024, 11:22 AM IST

Bribe Through Google Pay
Bribe Through Google Pay (ETV Bharat)

Bribe Through Google Pay: హైదరాబాద్ నగరంలో సెల్‌ఫోన్‌ దొంగలు రెచ్చిపోవడంతో అధికారులు యాంటీ స్నాచింగ్‌ టీమ్‌లను రంగంలోకి దింపారు. అయితే, దొంగల విషయంలో కొందరు పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా పంజాగుట్ట ఠాణా పరిధిలో ఇటీవల అర్ధరాత్రి దాటాక అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని ఒక హోంగార్డు అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తి, తనకు గాంధీనగర్‌లో హోంగార్డుతో పరిచయం ఉందంటూ ఫోన్‌ చేసి ఇక్కడి కానిస్టేబుల్‌తో మాట్లాడించాడు. అనంతరం అతడిని వదిలేశారు.

కొద్దిరోజుల క్రితం ఇదే వ్యక్తిని సెల్‌ఫోన్‌ చోరీ కేసుల్లో సైఫాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి ఫోన్‌కాల్‌ జాబితా పరిశీలించినపుడు హోంగార్డు, కానిస్టేబుళ్లతో సంప్రదింపులు జరిపినట్టు గుర్తించారు. నిందితుడి ఫోన్‌లోని గూగుల్‌పే యాప్‌ ద్వారా హోంగార్డు బ్యాంకు ఖాతాకు కొంత నగదు బదిలీ చేసినట్లు తేల్చారు. విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఇద్దరు కానిస్టేబుళ్లు, హోంగార్డులపై విచారణ ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details