Police Busted Mujra party at Bandlaguda : హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ముజ్రా పార్టీ నిర్వహించిన 12 మందిని దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 28న అర్ధరాత్రి నలుగురు ట్రాన్స్జెండర్లతో కలిసి 8 మంది వ్యక్తులు లేక్ వ్యూ హిల్స్ గౌస్‌నగర్ ప్రాంతంలో ముజ్రా పార్టీ నిర్వహించారు.
Published : 4 hours ago
పాతబస్తీలో ముజ్రా పార్టీ - 12 మందిని అరెస్టు చేసిన పోలీసులు
Police Busted Mujra party at Bandlaguda (ETV Bharat)
విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసిన పోలీసులు, వారి నుంచి ఒక యాంప్లిఫయర్, లౌడ్ స్పీకర్ బాక్స్ స్వాధీనం చేసుకున్నారు. నలుగురు ట్రాన్స్జెండర్లతో కలిసి అశ్లీల నృత్యానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం నిర్వాహకుడు పరారీలో ఉన్నాడు. ఈ మేరకు బండ్లగూడ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.