మంత్రి సీతక్కను కలిసిన పారాలింపిక్స్ కాంస్య పతక విజేత దీప్తి జీవాంజి
Published : Sep 8, 2024, 12:42 PM IST
Para Athlete Deepthi Jeevanji meet Minister Seethakka :పారిస్ పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ పారా అథ్లెట్ దీప్తి జీవాంజి మంత్రి సీతక్కను కలిశారు. ఆమె శాట్ ఛైర్మన్ శివసేనారెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్ ఛైర్మన్ ముత్తినేని వీరయ్యతో కలిసి ప్రజాభవన్‌లో మంత్రి సీతక్కతో భేటీ అయ్యారు. యువ అథ్లెట్ జీప్తి జీవాంజి, కోచ్ రమేశ్‌లను మంత్రి సీతక్క సత్కరించారు. ఈ సందర్భంగా దీప్తిని అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.