ETV Bharat / snippets

డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌

author img

By ETV Bharat Telangana Team

Published : 23 hours ago

NIKHAT ZAREEN AS DSP IN TELANGANA
Boxer Nikhat Zareen Appointed as DSP (ETV Bharat)

Boxer Nikhat Zareen Appointed as DSP : తెలంగాణకు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు జాయినింగ్ ఆర్డర్​ను డీజీపీకి అందజేశారు. రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్​గా నిలిచి కామన్వెల్త్ గేమ్స్​లో బంగారు పతకం సాధించారు. ఏషియన్ గేమ్స్​లోనూ రతజ పతకం సాధించారు. ఇటీవల జరిగిన ప్యారిస్ ఒలంపిక్స్​లోనూ పాల్గొన్నారు.

ఇటీవల తెలంగాణ కేబినెట్ స‌మావేశంలో నిఖత్ జరీన్​కు డీఎస్పీ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ స్పెషల్ పోలీసు విభాగంలో డీఎస్పీగా ఉద్యోగం ఇస్తూ హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరిస్తూ నిఖత్ జరీన్ జాయినింగ్ ఆర్డర్​ను డీజీపీకి అందజేశారు. ఈ సందర్భంగా డీజీపీ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.