ETV Bharat / bharat

రైల్వే ట్రాక్‌పై ఐరన్ పోల్- లోకోపైలట్‌ అలర్ట్​తో తప్పిన భారీ ప్రమాదం! - Iron Pole On Railway Track

author img

By ETV Bharat Sports Team

Published : 6 hours ago

Iron Pole On Railway Track : లోకోపైలట్‌ అప్రమత్తతో యూపీలో ఓ ఎక్స్​ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. అసలేం జరిగిందంటే?

Iron Pole On Railway Track
Iron Pole On Railway Track (Source : ANI)

Iron Pole On Railway Track : ఉత్తర్​ప్రదేశ్ రాంపుర్‌లో త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఇటీవల కాళింది ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలపై గ్యాస్‌ సిలిండర్‌ను ఢీకొట్టగా, తాజాగా అదే తరహా ఘటన త్రుటి తప్పింది. బుధవారం రాత్రి నైనీ జన్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ (12091) రైలు వెళ్తుండగా పట్టాలపై టెలిఫోన్‌ స్తంభం పడి ఉన్నట్లు లోకోపైలట్‌ గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన ఆయన, ఎమర్జెన్సీ బ్రేకులు వేయడం వల్ల పెను ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఇది విధ్వంసకర చర్య అని పేర్కొన్నారు.

ఇదీ జరిగింది
బుధవారం రాత్రి 10.18 గంటల సమయంలో బిలాస్‌పుర్‌ రోడ్‌ - రుద్రపుర్‌ సిటీ మధ్యలో పట్టాలపై దాదాపు ఆరు మీటర్ల పొడవు గల ఇనుప స్తంభాన్ని లోకోపైలట్‌ గుర్తించారు. వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలు ఆపారు. తర్వాత రుద్రాపుర్‌లోని స్టేషన్‌ మాస్టర్‌కు ఈ సమాచారం అందించారు. ట్రాక్ క్లియర్ చేసిన తర్వాత రైలును సురక్షితంగా తీసుకెళ్లినట్లు రైల్వే అధికార ప్రతినిధి వెల్లడించారు.

అయితే రైళ్ల కార్యకలాపాలకు నష్టం కలిగించే ఉద్దేశంతో సంఘ విద్రోహక శక్తులు రైల్వే ట్రాక్‌లపై బండరాళ్లు పెట్టడం, పట్టాలను విరగొట్టడం, గ్యాస్‌ సిలిండర్లు వంటి విధ్వంసక చర్యలతో అడ్డంకులు సృష్టిస్తున్నారని పలు రైల్వే డివిజన్లు నివేదించాయని తెలిపారు. ఆయా విభాగాల ఫిర్యాదులతో ఎఫ్‌ఐఆర్‌ (FIR) లు నమోదయ్యాయని తెలిపారు. సంఘ వ్యతిరేక శక్తులను గుర్తించి కఠిన శిక్షలు పడేలా చర్యలు చేపడతామని అధికారులు పేర్కొన్నారు.

ఇటీవల యూపీ కాన్పుర్‌లోనూ ఇదే తరహా ఘటన జరిగింది. ప్రయాగ్‌రాజ్‌ నుంచి హరియాణాలోని భివానీ వెళ్తున్న కాళింది ఎక్స్‌ప్రెస్‌ పట్టాలపై ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ను ఢీకొట్టింది. ట్రాక్‌పై ఏదో అనుమానాస్పద వస్తువు ఉన్నట్లు గుర్తించిన లోకోపైలట్‌ వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును నిలిపివేశారు. అప్పటికే రైలు ఆ సిలిండర్‌ను ఢీకొనడం వల్ల అది పట్టాలకు దాదాపు 50 మీటర్ల దూరంలో ఎగిరిపడింది. అదృష్టవశాత్తూ దానివల్ల రైలుకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.

రైలు పట్టాలపై 140 కిలోల సిమెంట్ దిమ్మెలు- తప్పిన భారీ ప్రమాదం!

ప్రాణాలు పణంగా పెట్టి - రైలు ప్రమాదాన్ని తప్పించిన ట్రాక్‌మ్యాన్‌ - Konkan Railway Trackman Bravery

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.