Ministers Review on Endowment Dept : తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమైన దేవాలయాల్లో మౌళిక వసతులు, అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. సచివాలయంలోని దేవాదాయ ధర్మాదాయ మంత్రిత్వ శాఖ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం, బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయాల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, అభివృద్ధి పనుల పురోగతిపై అటవీ, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ లతో కలిసి సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో ప్రతి దేవాలయంలో సింథటిక్ శాలువాలు వాడకుండా చేనేత శాలువాలు, చేనేత బ్యాగులు వాడేలా ఆదేశాలు ఇవ్వాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లు వినతిపత్రం ఇచ్చారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో జరిగే దసరా నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంతరావులు విడుదల చేశారు.
ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంతరావు, బాసర దేవాలయ ఈవో విజయ రామారావు, వేములవాడ దేవాలయ ఈవో వినోద్, భద్రాచలం ఈవో రమాదేవి, స్థపతి ఎన్. వల్లి నాయగన్, ఎస్ఈ కె. దుర్గా ప్రసాద్, సహాయ స్థపతి పి. గణేషన్, ప్రధానార్చకులు ఉమేష్, కన్సర్వేష ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ మూర్తి, పలువురు అర్చకులు, తదితరులు పాల్గొన్నారు.