national

శ్రీశైలానికి కృష్ణమ్మ పరుగులు - జూరాల నుంచి నీటి విడుదల

By ETV Bharat Telangana Team

Published : Jul 27, 2024, 10:37 PM IST

Jurala water to Srisailam
JURALA PROJECT WATER UPDATE (ETV Bharat)

Jurala water to Srisailam :జూరాల ప్రాజెక్టులో భారీగా వరద నీరు చేరడంతో అధికారులు దిగువనున్న శ్రీశైలానికి నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టులో 3 లక్ష 2 వేల క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా 44 గేట్లు తెరిచి దిగువ గేట్ల ద్వారా 2 లక్ష 93 వేల క్యూసెక్కులు, జల విద్యుత్ ద్వారా 19 వేల క్యూసెక్కుల చొప్పున మొత్తం 3 లక్ష 16 వేల 308 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో కృష్ణమ్మ శ్రీశైలం వైపు పరుగులు తీస్తోంది.

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.75 టీఎంసీల నీరు ఉంది. అలాగే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీటర్లకుగాను‌ ప్రస్తుత నీటిమట్టం 317.55 మీటర్లు ఉన్నాయి. జూరాల జలాశయం కింద ఉన్న కుడి, ఎడమ కాలువలతో పాటు నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ సాగునీటి కోసం నీటిని విడుదల చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details