national

మణికొండ చిత్రపురి కాలనీలో అక్రమ నిర్మాణదారులకు షాక్ - ఆరు విల్లాలు కూల్చివేత

By ETV Bharat Telangana Team

Published : Aug 20, 2024, 5:13 PM IST

CHITRAPURI COLONY VILLAS DEMOLISHED
Officers Demolished Villas in Manikonda (ETV Bharat)

Officers Demolished Villas in Manikonda :హైదరాబాద్‌ మణికొండ చిత్రపురి కాలనీలో అక్రమ కట్టడాలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. అక్రమంగా నిర్మించిన ఆరు విల్లాలను అధికారులు కూల్చివేశారు. 220 విల్లాలకు అనుమతులు పొంది అదనంగా ఆరు విల్లాలను నిర్మించినట్లు అధికారులు తెలిపారు. ప్లస్ వన్ అనుమతులు పొంది నిబంధనలకు విరుద్ధంగా జీ ప్లస్ త్రీ నిర్మాణం చేసినట్లు తెలిపారు. పోలీసుల బందోబస్తు మధ్య విల్లాలను జేసీబీ సాయంతో పడగొట్టారు. ఈ సమయంలో కాసేపు సొసైటీ సభ్యులకు అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ABOUT THE AUTHOR

...view details