national

By ETV Bharat Telangana Team

Published : Sep 26, 2024, 8:51 AM IST

ETV Bharat / snippets

నిండుకుండల్లా జంట జలాశయాలు - పరీవాహక ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేసిన అధికారులు

HYDERABAD TWIN RIVER GATES OPEN
Himayat Sagar and Osman Sagar Gates Lifted (ETV Bharat)

Himayat Sagar and Osman Sagar Gates Lifted : ఎగువన కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ జంట జలాశయాలు నిండుకుండల్లా మారాయి. భారీగా వరద నీరు చేరుతుండటంతో ఉస్మాన్​సాగర్, హిమాయత్ సాగర్​లు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. హిమాయత్ సాగర్ 1763.50 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టం కాగా, 1763.40 అడుగులకు చేరుకుంది. అలాగే ఉస్మాన్​సాగర్ 1790 అడుగుల పూర్తి స్థాయికి నిండింది.

దీంతో అప్రమత్తమైన అధికారులు ఉస్మాన్​సాగర్ 2 గేట్లు ఎత్తి 234 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. అలాగే హిమాయత్ సాగర్​కు సంబంధించి ఒక గేటు ఎత్తి నీటిని విడుదల చేశారు. రెండు రిజర్వాయర్ల నుంచి మూసీలోకి నీరు వదలడంతో పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details