ETV Bharat / offbeat

ఈ కొలతలతో చేస్తే 'హోటల్ స్టైల్ మటన్ దమ్ బిర్యానీ' పక్కా! ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు!! - Mutton Dum Biryani Recipe

author img

By ETV Bharat Features Team

Published : 3 hours ago

Mutton Dum Biryani Recipe: మాంసాహారాల్లో ఎన్ని వెరైటీలు​ ఉన్నా.. మటన్​ దమ్ బిర్యానీ రేంజ్​ మాత్రం వేరే ఉంటది. అయితే, ఇంట్లో సరిగ్గా చేసుకోవడం రాక చాలా మంది.. హోటళ్లలోనే ఎక్కువగా తింటుంటారు. కానీ ఇప్పుడు చెప్పబోయే పద్ధతిలో చేస్తే మాత్రం చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మటన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Mutton Dum Biryani Recipe
Mutton Dum Biryani Recipe (ETV Bharat)

Mutton Dum Biryani Recipe: నాన్​వెజ్ ప్రియులు కాస్త ధర ఎక్కువే అయినా మటన్​ను చాలా ఇష్టంగా తింటారు. ముఖ్యంగా మటన్ దమ్ బిర్యానీ క్రేజ్ అయితే మాములుగా ఉండదు. కానీ బయట హోటళ్లలో కల్తీ మాంసం భయంతో తినాలంటేనే ఆలోచిస్తుంటారు. అలా అనీ ఇంట్లో చేసుకోవడం రాక ఇబ్బందులు పడుతుంటారు. ఇక మీకు అలాంటి టెన్షన్ అక్కర్లేదు. ఇప్పుడు చెప్పే ఒక్క కొలతను అర్థం చేసుకుంటే ఎన్ని కిలోల మటన్ బిర్యానీ అయినా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా ఈ తీరులో మటన్ సరిగ్గా ఉడకకపోవడం, అడుగు పట్టడాలు అసలే ఉండవు. ఈ రెసిపీని చాలా సింపుల్​గా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

మటన్ కోసం కావాల్సిన పదార్థాలు

  • ఒక కేజీ మటన్
  • కొద్దిగా పుదీనా
  • కొద్దిగా కొత్తిమీర
  • ఒక టీ స్పూన్ షాజీరా
  • 3 బిర్యానీ ఆకులు
  • 18 లవంగాలు
  • 5 నల్ల యాలకలు
  • 3 అనాస పువ్వులు
  • 8 యాలకలు
  • 2 మరాఠీ మొగ్గలు
  • 6 ఇంచుల దాల్చిన చెక్క
  • కొద్దిగా జాపత్రి
  • పావు టీ స్పూన్ జాజికాయ పొడి
  • పావు కప్పు నూనె
  • ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు
  • ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి
  • 2 టీ స్పూన్ల కారం
  • ఒక టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి
  • పావు టీ స్పూన్ పసుపు
  • 6 పచ్చిమిరపకాయలు
  • ఒక నిమ్మకాయ రసం
  • ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా
  • ఒక కప్పు మీగడ పెరుగు
  • ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్

బిర్యానీ కోసం కావాల్సిన పదార్థాలు

  • ఒక కిలో బాస్మతి బియ్యం
  • పావు కప్పు నూనె
  • 3 ఉల్లిపాయ ముక్కలు
  • 4 బిర్యానీ ఆకులు
  • 3 అనాస పువ్వులు
  • 5 నల్ల యాలకలు
  • 4 ఇంచుల దాల్చిన చెక్క
  • 10 యాలకలు
  • 15 లవంగాలు
  • ఒక టేబుల్ స్పూన్ షాజీరా
  • కొద్దిగా పత్తర్ పూలు
  • 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్
  • పావు కప్పు ఉప్పు
  • 6 పచ్చిమిరపకాయలు
  • 2 మరాఠీ మొగ్గలు
  • కొద్దిగా పుదీనా
  • కొద్దిగా కొత్తిమీర
  • పావు టీ స్పూన్ గరం మసాలా
  • 4 పెద్ద చెంచాల నెయ్యి
  • 3 టేబుల్ స్పూన్ల కుంకుమ పువ్వు పాలు

తయారీ విధానం

  • ముందుగా మటన్​ను శుభ్రంగా కడిగి ఓ గిన్నెలోకి తీసుకోవాలి.
  • ఇందులోకి పుదీనా, కొత్తిమీర, షాజీరా, బిర్యానీ ఆకులు, లవంగాలు, నల్ల యాలకలు, అనాస పువ్వులు, యాలకలు, మరాఠీ మొగ్గలు. దాల్చిన చెక్క, జాపత్రి, జాజికాయ పొడి, నూనె, ఉప్పు, ధనియాల పొడి, కారం, జీలకర్ర పొడి, పసుపు వేసి ముక్కలను బాగా కలపాలి.
  • ఆ తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, నిమ్మకాయ రసం, గరం మసాలా, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కకు పట్టేలా బాగా కలపాలి. (సాధ్యమైతే రాత్రంతా ఫ్రిజ్​లో పెడితే చాలా టేస్ట్​గా ఉంటుంది. కనీసం రెండు గంటలు నానబెట్టాలి.)
  • మరోవైపు బాస్మతి బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి సుమారు గంటపాటు నానబెట్టుకోవాలి.
  • స్టౌ ఆన్ చేసుకుని బిర్యానీ గిన్నెలో నూనె పోసి వేడి చేసుకోవాలి. (బిర్యానీ వండే గిన్న వెడల్పుగా ఉండాలి. వండితే ముప్పావు గిన్నె వరకు మాత్రమే వచ్చేలా ఉండాలి)
  • అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. (ఇందులో సగం ఉల్లిపాయలను తీసి పక్కకు పెట్టుకోవాలి.)
  • ఆ తర్వాత ఇందులోనే రెండు గంటల పాటు నానబెట్టుకున్న మటన్ మిశ్రమాన్ని వేసి హై ఫ్లేమ్​పై 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
  • మంటను లో ఫ్లేమ్​కు తగ్గించి మరో 8 నిమిషాలు ఉడికిస్తే నూనె సెపరేట్ అవుతుంది.
  • అప్పుడు ఇందులో లీటర్ పావు వేడి నీటిని పోసి మీడియం ఫ్లేమ్​లో మటన్​ను మెత్తగా ఉడికించుకోవాలి. (మరిగే వేడి నీరు పోస్తేనే మటన్​ సాఫ్ట్​గా వస్తుంది. చన్నీళ్లు పోస్తే ముక్క సరిగ్గా ఉడకదు)
  • ఇలా మొత్తం సుమారు 25 నిమిషాలు ఉడికించిన తర్వాత పుదీనా, కొత్తిమీర తరుగు చల్లి దించేసుకోండి.
  • ఇప్పుడు మరో గిన్నెను తీసుకుని మూడున్నర లీటర్ల నీటిని మరిగించుకోవాలి. ఇందులో బిర్యానీ ఆకులు, అనాస పువ్వులు, నల్ల యాలకులు, దాల్చిన చెక్క, యాలకలు, లవంగాలు, షాజీరా, పత్తర్ పూల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పచ్చిమిరపకాయలు, మరాఠీ మొగ్గలు వేసి 10 నిమిషాలు మరగనివ్వండి.
  • ఆ తర్వాత నానబెట్టుకున్న బాస్మతి బియ్యం, పుదీనా, కొత్తిమీర వేసి హై ఫ్లేమ్​పై 80 శాతం ఉడికించుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ ఆఫ్ చేసి మసాలాలతో సహా సగం అన్నాన్ని వడకట్టుకుని ఉడికించుకున్న మటన్​పై అంతా చల్లుకోవాలి.
  • ఆ తర్వాత గరం మసాలా, నెయ్యి పోసి మిగిలిన అన్నాన్ని వేసుకోవాలి.
  • ఇప్పుడు మరోసారి గరం మసాలా, నెయ్యి, పుదీనా, కొత్తిమీర తరుగు, వేయించుకున్న ఉల్లిపాయలు, కుంకుమ పువ్వు పాలు పోసి దమ్ బయటికి పోకుండా మూత పెట్టుకోవాలి.
  • స్టౌ ఆన్ చేసి హై ఫ్లేమ్​పై 8 నిమిషాల పాటు... లో ఫ్లేమ్​పై 10 నిమిషాలు దమ్ ఇచ్చి స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత సుమారు 30 నిమిషాల పాటు అలా వదిలేసిన అనంతరం సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ మటన్ దమ్ బిర్యానీ రెడీ

సూపర్ టేస్టీ "బెంగాలీ స్టైల్ ఎగ్ కర్రీ" - నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా - రుచి అద్దిరిపోతుంది! - Bengali Style Egg Curry

సండే స్పెషల్​: నోరూరించే "హైదరాబాదీ మటన్​ తహరి" - మెతుకు మెతుకులో అద్భుతమైన రుచి! - Hyderabadi Mutton Tahari

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.