Pocso Cases Increasing in Hyderabad : చిన్నారులతో చిత్రీకరించిన అశ్లీల వీడియోలు డౌన్లోడ్ చేసి చూసినా, వ్యాప్తి చేసినా ఇక జైల్లో ఊచలు లెక్కపెట్టాడానికి సిద్ధంగా ఉండాల్సిందే. ఇది సర్వోన్నత న్యాయస్థానం తీర్పు. ఫోన్, కంప్యూటర్లో గుట్టుగా చూస్తే ఎవరు గుర్తించరు అనుకోవద్దు. సాంకేతిక ఆధారాలతో పోలీసులు కనిపెడతున్నారు. వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇతరులకు పంపిస్తున్నట్లు వెలుగుచూస్తుండటంతో వాటి నియంత్రణపై రాచకొండ పోలీసులు దృష్టి సారించారు.
హైదరాబాద్ కమిషనరేట్‌లో ఈ ఏడాది ఆగస్టు వరకు 520 పోక్సో కేసులు నమోదయ్యాయి. పోక్సో కేసుల్లో అరెస్టయ్యే నిందితుల్లో ఎక్కువ మందిపై అశ్లీల వీడియోల ప్రభావం ఉన్నట్లు తేలింది. ఇలాంటి కేసుల్లో అభియోగాలు నిరూపితమైతే ఐదు సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశముంటుంది.
అశ్లీల వీడియోలకు బానిసగా మారిన ఓ వ్యక్తి అందులో ఉన్నట్లుగా చేయాలని తన 13 ఏళ్ల కూతురిపై కన్నేశాడు. అతడి చేష్టలను బాలిక తిరస్కరిచింది. దీంతో ఆ బాలిక ఎవరికైనా చెబుతుందనే ఉద్దేశంలో బండరాయితో కొట్టి ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్యచేశాడు. సరిగ్గా చదువుకోవడం లేదని మందలించినందుకు ఇంటి నుంచి వెళ్లిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.
విద్యార్థినులపై లైంగిక వేధింపులు - ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎంపై పోక్సో కేసు
కన్నేసిన అమెరికా : మన దేశంపై ఇక్కడి పోలీసులే కాదు, విదేశీ దర్యాప్తు సంస్థలు కూడా కన్నేశాయి. చైల్డ్ పోర్నోగ్రఫీ వ్యాప్తి చేస్తున్న వారిపై దృష్టి సారించాయి. అమెరికాలోని హోంల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్, నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్స్ తదితర సంస్థలు ఐపీ అడ్రస్‌లను కేంద్ర హోంశాఖకు పంపిస్తున్నాయి. అలా వచ్చిన సమాచారానంతో గతేడాది ఒక యువకుడిని సైబర్ పోలీసులు అరెస్టు చేశారు.
చిన్నారులపై లైంగిక దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని రాచకొండ కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు. చిన్నారుల అశ్లీల దృశ్యాలు చూసినా, సామాజిక మాధ్యమాల్లో ఇతరులకు పంపినా పోక్సో, ఐటీ చట్టాల ప్రకారం ఐదేల్లు జైలు శిక్ష పడుతుందన్నారు. చిన్నారులను మానవ మృగాల నుంచి కాపాడుకుని నేరరహిత సమాజంలో భాగస్వాములవుదామని పిలుపునిచ్చారు.
వలపు వల - ఉచ్చులో చిక్కి విలవిల - ప్రేమ పేరిట బాలికలపై పంజా - Men Cheating Girls in Name of Love
మైనర్ బాలికపై అత్యాచారం చేసిన సీఐ - అదుపులోకి తీసుకున్న పోలీసులు - POCSO Case Filed On CI