ETV Bharat / state

దొంగలున్నారు తస్మాత్​ జాగ్రత్త - దసరాకు సొంతూళ్లకు వెళ్లేవారికి పోలీసుల టిప్స్ ఇవే! - Home Safety Tips for Dussehra

Home Safety Tips for Dussehra by police : రాష్ట్రంలో దసరా ఉత్సవాలు ప్రారంభమవ్వనున్న నేపథ్యంలో చాలా మంది తమ ఫ్యామిలీలతో పాటు నగరం నుంచి స్వగ్రామాలకు ప్రయాణమవుతుంటారు. దీనినే ఆసరాగా తీసుకుని కొంతమంది గజదొంగలు రెచ్చిపోతుంటారు. తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని దోపిడీల పర్వం సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే సైబరాబాద్​ పోలీసులు చోరీల నివారణకు కొన్ని జాగ్రత్తలు సూచిస్తున్నారు.

Home Safety Tips for Dussehra by police
Home Safety Tips for Dussehra by police (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 1, 2024, 10:21 AM IST

Home Safety Measures By Police : రాష్ట్రంలో దసరా పండుగ సెలవులు మొదలవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇంటిల్లిపాదీ నగరం నుంచి సొంత ఊళ్లకు ప్రయాణమవుతుంటారు. గజ దొంగలు మాత్రం ఇలాంటి సమయం కోసమే కాచుకుని కూర్చుంటారు. తాళం వేసిన ఇళ్లు కనిపిస్తే చాలు గుల్ల చేస్తారు. ఏటా దసరా, సంక్రాంతి పండుగల సమయాల్లోనే చోరీలు అధికంగా నమోదవుతుంటాయి. ఈ నేపథ్యంలోనే సైబరాబాద్‌ పోలీసులు చోరీల నివారణకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కచ్చితంగా పాటిస్తే చోరీలు తగ్గుతాయని పేర్కొంటున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

  • పట్టణం నుంచి మీ స్వగ్రామానికి వెళ్లేటప్పుడు విలువైన బంగారు, వెండి వస్తువులు, నగదు ఇంట్లో ఉంచవద్దు. వెంట తీసుకెళ్లడం లేదా బ్యాంకు లాకర్లలో భద్రపరచడమే ఉత్తమం. ఇంట్లో అయితే రహస్య ప్రదేశంలో దాచుకోవాలి.
  • మీ ఇంటికి సెక్యూరిటీ అలారం, మోషన్‌ సెన్సర్‌ లేదా సెంట్రల్‌ లాక్‌ సిస్టమ్​ను అమర్చుకోవాలి. ఇంట్లో లేనప్పుడు పాలప్యాకెట్లు, పత్రికలు తలుపు ముందు జమవ్వకుండా చూడాలి. ఇంటి బయట, లోపల కొన్ని లైట్లు ఆన్‌లో ఉంచుకోవాలి.
  • వాహనాలను కచ్చితంగా ఇంటి ఆవరణలోనే పార్కింగ్‌ చేయాలి. ద్విచక్ర వాహనాల(బైక్​, సైకిళ్లు) చక్రాలకు ప్రత్యేక లాక్​ వేయాలి.
  • బీరువా, లాకర్‌ తాళాలను రహస్య ప్రదేశంలో మాత్రమే దాచాలి. ఇంట్లోని సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు సెల్‌ఫోన్‌ ద్వారా గమనిస్తూ ఉండాలి.
  • ఊరు, విహార యాత్రలకు వెళ్లే విషయం సామాజిక మాధ్యమాల్లో(ఫేస్​బుక్​, ఎక్స్, ఇన్​స్టాగ్రామ్) పంచుకోవద్దు.
  • కాలనీ సంఘాలు, అపార్టుమెంట్లలో ఉన్నవారైతే కచ్చితంగా సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకోవాలి.
  • కాలనీల్లో స్వచ్ఛంద కమిటీలు ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం.
  • ఎప్పటికప్పుడు పోలీసులకు అందుబాటులో ఉంటూ అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై సమాచారమివ్వాలి.
  • చోరీలకు ముందు దొంగలు కచ్చితంగా రెక్కీ నిర్వహిస్తుంటారు. పగటిపూట వేర్వేరు కారణాలతో వచ్చి కాలనీల్లో రెక్కీ చేసి రాత్రి దొంగిలిస్తుంటారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్‌ 100కు ఫోన్​చేసి వెంటనే సమాచారమివ్వాలి.
  • కాలనీల్లో దొంగతనాలు అరికట్టేందుకు డయల్‌ 100 లేదా స్థానిక పోలీస్​స్టేషన్‌ నెంబరుకు సమాచారం ఇవ్వాలి.

పైన వివరించిన జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.

మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది: పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.