national

ETV Bharat / snippets

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా

MLC kavitha Delhi Liquor case
MLC kavitha Delhi Liquor case (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 5, 2024, 12:05 PM IST

MLC Kavitha Delhi Liquor Case :దిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌పై విచారణను ట్రయల్ కోర్టు మరోసారి వాయిదా వేసింది. సీబీఐ కేసులో వాదించేందుకు ఆమె తరపున సీనియర్ లాయర్లు అందుబాటులో లేనందున వాయిదా వేయాలని కవిత లాయర్ కోరారు. డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌పై వాదనలను చివరిసారి వాయిదా వేస్తున్నట్లు జడ్జి వెల్లడించారు. ఆగస్టు 7న కవిత బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు వింటామని తెలిపారు. 7వ తేదీన వాదనలు వినిపించకపోతే పిటిషన్‌ విత్ డ్రా చేసుకోవాలని న్యాయమూర్తి సూచించారు. కవిత పిటిషన్‌పై విచారణ ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది.

ABOUT THE AUTHOR

...view details