national

ఇది జాబ్‌ క్యాలెండర్‌ కాదు జోక్ క్యాలెండర్‌: హరీశ్‌ రావు

By ETV Bharat Telangana Team

Published : Aug 3, 2024, 7:15 AM IST

Harish Rao
Harish Rao (ETV Bharat)

Harish Rao comments job calendar :కాంగ్రెస్‌ ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ కాదు జోక్ క్యాలెండర్‌ ప్రకటించిందని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం యువతను మోసం చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే అశోక్‌నగర్‌కో, ఓయూ లోని నిరుద్యోగుల వద్దకో రావాలని సవాల్‌ విసిరారు.

పోస్టుల సంఖ్య చెప్పకుండా నిరుద్యోగులను దగా చేశారని మండిపడ్డారు. సభలో మాట్లాడేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలను దానం నాగేందర్‌తో తిట్టించారని విమర్శించారు. మంద బలం అండతో శాసనసభను కౌరవసభగా మార్చారని ఆరోపించారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని హరీశ్‌ రావు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details