national

By ETV Bharat Telangana Team

Published : Jul 9, 2024, 7:14 PM IST

ETV Bharat / snippets

యూనివర్సిటీ బాయ్స్​ హాస్టల్లో గర్ల్ ఫ్రెండ్ - విద్యార్థి సస్పెండ్

GIRL WITH BOY IN TU HOSTEL
Girl in Telangana university Boys Hostel (ETV Bharat)

Girl in Telangana university Boys Hostel :హాస్టల్లో ఉంటున్న ఓ యువకుడు, తన స్నేహితురాలికి అదే గదిలో వసతి కల్పించిన ఘటన తెలంగాణ విశ్వవిద్యాలయంలో జరిగింది. విషయం తెలిసిన అధికారులు సదరు యువకుడిని వర్సిటీ, హాస్టల్ నుంచి సస్పెండ్ చేశారు. పదిహేను రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వర్సిటీలో పీజీ రెండో ఏడాది చదువుతున్న విద్యార్థి, బాలుర వసతి గృహం నూతన భవనంలో ఉండేవాడు.

తనకు పరిచయం ఉన్న స్నేహితురాలు నిజామాబాద్‌కు వచ్చిన సందర్భంలో యువకుడు ఆమెను సరాసరి తను ఉంటున్న గదికి తీసుకొచ్చి ఆశ్రయమిచ్చాడు. వసతి గృహంలో అమ్మాయి ఉండటాన్ని గమనించిన ఇతర విద్యార్థులు విషయాన్ని వార్డెన్‌కు చెప్పారు. వారు రిజిస్ట్రార్‌కు సమాచారం ఇచ్చారు. విచారణలో విషయం వాస్తవం అని తేలటంతో అబ్బాయిలు ఉండే వసతి గృహంలోకి యువతిని తీసుకురావటాన్ని తీవ్రంగా పరిగణించి విద్యార్థిపై చర్యలు తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details