national

ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగకుండా నిధులు విడుదల చేయాలి - సబితా ఇంద్రారెడ్డి

By ETV Bharat Telangana Team

Published : Jun 29, 2024, 9:44 PM IST

EX MINISTER SABITHA INDRAREDDY
Ex Minister Sabitha Indrareddy (ETV Bharat)

Ex Minister Sabitha Indrareddy : ప్రభుత్వం కక్ష సాధించపు చర్యలకు పాల్పడకుండా, ప్రజల సంక్షేమంపై దృష్టిసారించాలని మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బడంగ్​పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు కాలనీల్లో పర్యటించిన ఆమె, రోడ్ల పరిస్థితులపై అధికారులతో కలసి పరిశీలించారు. అధ్వాన్న స్థితిలో ఉన్న రోడ్లను చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వ హయాంలో ఇంటర్నల్ రోడ్లు, మెయిన్ రోడ్లు, డ్రైనేజ్ సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన రూ.250 కోట్ల నిధులను ఈ ప్రభుత్వం నిలిపివేసిందని పేర్కొన్నారు. ప్రజల అవసరాల కోసం ప్రారంభించిన పనులు పూర్తి చేయాలని, కక్ష సాధింపు చర్యలకు దిగకుండా వెంటనే నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కుల సంఘాలకు కేటాయించిన భూముల సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details