Father's Day Special : ఉప్పొంగిన నాన్న గుండె - ట్రైనీ ఐఏఎస్ కుమార్తెకు ఐపీఎస్ తండ్రి సెల్యూట్
Published : Jun 16, 2024, 8:08 AM IST
|Updated : Jun 16, 2024, 9:16 AM IST
Father's Day Special 2024: ఫాదర్స్ డే ముందు రోజు హైదరాబాద్లో అరుదైన ఘటన జరిగింది. సినిమాలో కనిపించే దృశ్యం రాష్ట్ర పోలీసు అకాడమీలో ఆవిష్కృతమైంది. ఏడుగురు ప్రొబెషనరీ ఐఏఎస్లు శిక్షణలో భాగంగా శనివారం ఆర్బీవీఆర్ఆర్ రాష్ట్ర పోలీసు అకాడమీకి వచ్చారు. వీరిలో ఉమాహారతికి ఆమె తండ్రి, పోలీసు అకాడమీలో డిప్యూటీ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు పుష్పగుచ్చం అందించి సెల్యూట్ చేశారు. అనంతరం ఆనందంతో ఉప్పోంగిపోయారు. శిక్షణ ఐఏఎస్లకు అకాడమీ జాయింట్ డైరెక్టర్ మురళీధర్, డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు స్వాగతం పలకగా మరో డిప్యూటీ డైరెక్టర్ సి.నర్మద అకాడమీ కార్యక్రమాలను వివరించారు.