కుమారుడు బడికి వెళ్లడం లేదంటూ డయల్ 100కి తండ్రిఫోన్
Published : Jun 18, 2024, 4:33 PM IST
Father Dial 100 For Silly Reason :భూపాలపల్లి పోలీసులకు వింత అనుభవం ఎదురైంది. రామాయపల్లికి చెందిన ఓ వ్యక్తి డయల్ 100 కు ఫోన్ చేసి తన కుమారుడు పాఠశాలకు వెళ్లట్లేదు, వచ్చి తీసుకువెళ్లి జైల్లో వేయండి అనడంతో పోలీసులు కంగుతిన్నారు. గతేడాది బడికి వెళ్లమంటే కేవలం రెండునెలలు మాత్రమే వెళ్లాడని, ఆ తండ్రి తెలిపాడు. అనవసరంగా కాల్‌చేసిన అతడిని పోలీసులు పిలిపించి మందలించారు. ఏదైనా అత్యవసర సమయంలో డయల్ 100కి ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి సహకారం అందిస్తారని వివరించారు. వ్యక్తిగత సమస్యలపై డయల్ 100కి కాల్‌చేయవద్దని పోలీసులు సూచించారు.