Palaparthi David Raju Died : యర్రగొండపాలెం మాజీ శాసనసభ్యుడు పాలపర్తి డేవిడ్ రాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల మంత్రులు గొట్టిపాటి రవి కుమార్, డోలా బాల వీరాంజనేయస్వామి సంతాపం తెలిపారు. డేవిడ్ రాజు హఠాన్మరణం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని గొట్టిపాటి అన్నారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారని గుర్తుచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
యర్రగొండపాలెం మాజీ ఎమ్మెల్యే డేవిడ్రాజు మృతి
Palaparthi David Raju Passed Away (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 26, 2024, 9:45 AM IST
Ministers Condolence to David Raju :డేవిడ్ రాజు మృతి బాధాకరమని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా సంతనూతలపాడు, యర్రగొండపాలెం ప్రజలకు విశేష సేవలందించారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు వివరించారు.