ETV Bharat / snippets

దుర్గా కో-ఆపరేటివ్‌ బ్యాంకులో అవకతవకలు - లైసెన్స్​ రద్దు చేసిన ఆర్బీఐ

rbi_cancel_durga_bank_license
rbi_cancel_durga_bank_license (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 7 hours ago

Reserve Bank Canceled Durga Co-Operative Bank License: నిర్వహణలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఫిర్యాదుతో విజయవాడ పాతబస్తీలోని దుర్గా కో-ఆపరేటివ్‌ బ్యాంకు లైసెన్స్‌ను రిజర్వ్‌బ్యాంకు రద్దు చేసింది. డిపాజిట్లు కట్టిన వారికి గడువు ముగిసినా నగదు చెల్లించకపోవడంతో ఖాతాదారులు గతంలో పలుమార్లు ఆందోళనకు దిగారు. బ్యాంకులో రుణం మంజూరు కావాలంటే ఛైర్మన్‌ నుంచి దిగువస్థాయి అధికారి వరకూ లంచం ముట్టచెప్పాల్సిందేనని ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యాంకుపై రిజర్వ్‌ బ్యాంకు ఆంక్షలు విధించడంతో ఖాతాదారులంతా తాము దాచుకున్న సొమ్ము వస్తుందో రాదోనని ఆందోళన చెందుతున్నారు. రిజిస్ట్రార్ అఫ్ కోపరేటివ్ సోసైటి నియమించిన లిక్విడేటర్‌ మరో రెండో, మూడు రోజుల్లో బ్యాంకుకు వచ్చి ఖాతాదారులకు సొమ్ము చెల్లిస్తారని ఖాతాదారులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.