ETV Bharat / state

తిరుమల శ్రీవారికి రూ.2 కోట్ల విలువైన స్వర్ణజయంతి మాల

తిరుమల శ్రీవారికి విరాళంగా 2 కోట్ల రూపాయల విలువైన స్వర్ణ వైజయంతీ మాల - టీటీడీ ఛైర్మన్, టీటీడీ అదనపు ఈవోకి ఆభరణాలను అందజేత

gold_ornaments_donated_to_tirumala
gold_ornaments_donated_to_tirumala (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 6 hours ago

Updated : 5 hours ago

Gold Ornaments Worth 2 Crore Rupees Donated to Tirumala: తిరుమల శ్రీవారికి సుమారు 2 కోట్ల రూపాయల విలువైన స్వర్ణ వైజయంతీ మాలలను దాతలు విరాళంగా అందించారు. ఈ కానుకలను డీకే ఆదికేశవులు మనవరాలు చైతన్య ఉత్సవమూర్తులకు అలంకరించేందుకు విరాళంగా అందజేశారు. దాతలు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు (TTD Chairman BR Naidu), టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి ఆభరణాలను అందించారు. శుక్రవారం తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారికి కూడా మరో వైజయంతీ మాలను విరాళంగా ఇవ్వనున్నారు.

స్వామివారికి, అమ్మవారికి వైజయంతి మాల చేయించడం అనేది జరిగింది. శివుడు సుదర్శన చక్రం విష్ణుస్వామికి సమర్పించిన రోజు ఈ రోజు. శివుడినని, వెంకటేశ్వర స్వామిని సంవత్సరంలో ఒకే రోజు పూజిచడం జరుగుతుంది. శృంగేరి శారదా పీఠం స్వామి వచ్చి ఆయన ప్రాణ ప్రతిష్ఠ చేసి హారం ఇవ్వడం అనేది జరిగింది. అలాగే పద్మావతి దేవికి కూడా శుక్రవారం హారం సమర్పిస్తాము. హారంలోని వజ్రాలు చాలా పాతకాలానికి చెందినవి. ఆ హారం విలువ సూమారు రూ. 2 కోట్లుకు పైగా ఉంటుంది. మొత్తంగా నాలుగు హారాలు ఇవ్వడం జరిగంది.- చైతన్య, డీకే. ఆదికేశవులు మనవరాలు

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు సమయం: కాగా గడచిన రోజున(బుధవారం) తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు సమయం పట్టింది. 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 66,441 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 20,639 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. మొత్తంగా తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.12 కోట్లు వచ్చింది.

శ్రీవారిని దర్శించుకున్న అరవింద్ కేజ్రీవాల్: దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్న ఆయన ఇవాళ ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలోకి వెళ్ళిన అరవింద్ కేజ్రీవాల్ స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను.

దళారులపై నిఘా- టికెట్లు, గదుల విషయంలో వారి జోక్యం కుదరదు

శ్రీవారి భక్తులకు అలర్ట్​ - దీపావళికి తిరుమల వెళ్తున్నారా? ఈ విషయాలు తెలియకపోతే ఇబ్బందులు!

Last Updated : 5 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.