ED Summons to Mohammad Azharuddin :హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పరిధిలో జరిగిన అవకతవకల వ్యవహారానికి సంబంధించి మాజీ క్రికెటర్, కాంగ్రెస్ లీడర్ మహమ్మద్ అజహరుద్దీన్‌కు ఈడీ గురువారం సమన్లు జారీ చేసింది. ఆయన గతంలో హెచ్‌సీఏ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
హెచ్‌సీఏ నిధుల్లో రూ.20 కోట్ల అవకతవకలు - అజహరుద్దీన్‌కు ఈడీ నోటీసులు
ED Summons to Mohammad Azharuddin (ETV Bharat)
Published : Oct 3, 2024, 12:06 PM IST
ఇదిలా ఉండగా, తొలిసారి సమన్లు అందుకున్న అజహరుద్దీన్ గురువారం ఈడీ ముందు హాజరు కావాల్సి ఉంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియానికి సంబంధించి జనరేటర్లు, అగ్నిమాపక వ్యవస్థలు, ఇతర సామగ్రి కొనుగోళ్లకు సంబంధించి రూ.20 కోట్ల మేర నిధుల్లో అవకతవకలు చేసినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి.