ED Raids on Heera Groups in Hyderabad: హైదరాబాద్‌లో హీరా గ్రూప్ అధినేత నౌహీరా షేక్‌కు చెందిన కంపెనీల్లో ఈ నెల 3న జరిపిన సోదాలపై ఈడీ ప్రకటన విడుదల చేసింది. మనీ లాండరింగ్ చట్టం కింద హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఈ నెల 3న హైదరాబాద్‌లోని 5 చోట్ల సోదాలు నిర్వహించినట్లు తెలిపింది. పెట్టుబడులు పెడితే 36 శాతం అధిక లాభాలు వస్తాయంటూ ప్రజల నుంచి హీరా గ్రూప్ రూ.వేల కోట్లు సేకరించిందని ఈడీ తెలిపంది.
90 లక్షలు, 12 ఖరీదైన కార్లు, 13 ఆస్తిపత్రాలు స్వాధీనం - హీరా గ్రూప్ కంపెనీల్లో సోదాలపై ఈడీ ప్రకటన
ED Raids on Heera Groups in Hyderabad (ETV Bharat)
Published : Aug 5, 2024, 8:40 PM IST
ఈ సోదాల్లో రూ.90 లక్షల నగదు, 12 ఖరీదైన కార్లు, హీరా గ్రూప్‌నకు చెందిన 13 ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. నౌహీరా షేక్ బంధువులు, సహచరుల పేరిట రూ.45 కోట్ల మేర ఆస్తులు గుర్తించామని తెలిపింది. దీంతో పాటు రూ.25 కోట్ల విలువ చేసే 11 బినామీ ఆస్తుల పత్రాలు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది.