Instagram post in Mahabubad: తల్లిని కోల్పోయిన ఇద్దరు చిన్నారుల దయనీయ గాథను ఓ యువకుడు వీడియోతీసి ఇన్స్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. దానిని చూసిన వారు రూ.21 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించి ఔదార్యాన్ని చాటుకున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం బొజ్జన్నపేట గ్రామంలో ఉమ, నరేష్ దంపతులకు రెండున్నర ఏళ్ల కుమార్తె , 21రోజుల కుమారుడు ఉన్నారు.
ఒక్క ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌తో రూ.21 లక్షల విరాళాలు
Published : Sep 13, 2024, 5:38 PM IST
కుమారుడు జన్మించిన 18రోజుల తర్వాత ఉమ బ్రెయిన్ ట్యూమర్‌తో మరణించింది. చిన్నారుల ఆలనాపాలన కోసం స్థానిక యువకుడు వీరి వీడియో తీసి ఇన్స్ట్గ్రామ్లో పోస్ట్ చేశాడు. దాతల నుంచి రూ.23లక్షలు రాగా అంత్యక్రియలు, దశదినకర్మ, ఇతర అవసరాల కోసం రూ.లక్ష ఖర్చయ్యాయి. రూ.3 లక్షలను చిన్నారుల అవసరాల కోసం ఉంచారు. రూ.17 లక్షలను చిన్నారి నిత్విత పేరిట మహబూబాబాద్‌లోని ఎస్బిఐ బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఆమెకు 22ఏళ్ల నాటికి రూ.80లక్షలు వచ్చే విధంగా చేశారు.