భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ కృష్ణ ఎల్లాకు అరుదైన గౌరవం - వరించిన డీన్స్ మెడల్
Published : May 24, 2024, 3:41 PM IST
Deans Medal Award for Bharat Biotech Co Founder Krishna Ella : ప్రజారోగ్య రంగంలో విశిష్ఠ సేవలందిస్తున్న భారత్ బయోటెక్ కో ఫౌండర్ కృష్ణ ఎల్లాను జాన్స్ హోప్కిన్స్ బ్లూమ్‌బర్గ్ స్కూల్ అత్యున్నత పురస్కారం డీన్స్ మెడల్ వరించింది. వారి విశిష్ఠ సేవలకు కృష్ణ ఎల్లాకు ఈ అవార్డు అందజేసినట్లు జాన్స్ హోప్కిన్స్ బ్లూమ్‌బర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రకటించింది. బ్లూమ్‌బర్గ్ స్కూల్ స్నాతకోత్సవం సందర్భంగా డీన్ ఎల్లన్ జే మెకంజీ అవార్డును ఆయనకు అందజేశారు. ప్రజారోగ్య పరిరక్షణలో భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ కృష్ణ ఎల్లా పాత్ర అనిర్వచనీయమని కొనియాడారు. కొవిడ్ సమయంలో కొవాగ్జిన్‌తో వారు చేసిన సేవలను ప్రశంసించారు.