CM Revanth Meet AICC General Secretary KC Venugopal : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈ క్రమంలోనే హస్తినలోని కాంగ్రెస్ పెద్దలు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై ఇరువురి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం.
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Meet AICC General Secretary KC Venugopal (ETV Bharat)
Published : Jun 25, 2024, 3:05 PM IST
కాగా రేవంత్ వెంట ఎంపీలు మల్లు రవి, సురేశ్ షెట్కార్, చామల కిరణ్, అనిల్ కుమార్‌లు ఉన్నారు. సోమవారం కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన విషయాలను సీఎం రేవంత్ చర్చించిన విషయం తెలిసిందే.