national

By ETV Bharat Telangana Team

Published : Sep 22, 2024, 4:54 PM IST

ETV Bharat / snippets

ఆ టెండర్లలో అవినీతి జరగలేదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా : కేటీఆర్

KTR Comments On Minister Ponguleti
KTR Comments On Minister Ponguleti (ETV Bharat)

KTR Comments On Minister Ponguleti : అమృత్ టెండర్లలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని ప్రభుత్వం నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ఇదే అంశానికి సంబంధించి మంత్రి పొంగులేటి వ్యాఖ్యలపై తెలంగాణ భవన్​లో స్పందించిన కేటీఆర్ హైకోర్ట్ సీజే లేదంటే దిల్లీలోని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ దగ్గరకు తాను వచ్చేందుకైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ అంశంపై సీవీసీ వద్దకు ఎప్పుడు వెళ్దాం అనేదానిపై తేదీని పొంగులేటి ఖరారు చేసి చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం ఆశ్రిత పక్షపాతానికి పాల్పడ్డారని మండిపడ్డ కేటీఆర్ ఇప్పటికైనా తప్పును దిద్దుకుని టెండర్‌ను నిలిపివేయాలన్నారు. లేకపోతే ఈ విషయంలో మంత్రితోపాటు సీఎం సైతం రాజీనామా చేయాల్సి రావచ్చని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ప్రజలను , న్యాయస్థానాలను సైతం మోసం చేస్తోందని తప్పుడు సమాచారం ఇస్తోందని ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details