ETV Bharat / state

మూసీ అభివృద్ధి ప్రాజెక్టులో నిర్వాసితులకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లు - జీవో జారీ - CM Revanth Review On Musi River

CM Revanth Reddy Review On Musi River Development : మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్​మెంట్, హైదరాబాద్ మెట్రో రైలుపై అధికారులతో సీఎం రేవంత్​ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆక్రమిత చెరువులు, నాలాలతో పాటు, మూసీ పరివాహక ప్రాంత పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలు సేకరించాలని అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. వీరిలో అర్హులైన పేదలకు డబుల్ బెడ్​రూం లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపి వారికి భరోసా ఇవ్వాలని అధికారులకు సీఎం సూచించారు.

CM REVANTH REVIEW ON MUSI
CM REVANTH REVIEW ON MUSI Project (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 24, 2024, 9:31 PM IST

Updated : Sep 24, 2024, 9:55 PM IST

Double Bedroom Houses for Displaced Persons in Musi Project : మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 16,002 ఇళ్లను కేటాయిస్తూ జీవో ఇచ్చింది. మూసీ రివర్ బెడ్, బఫర్ జోన్​లో ఉన్న నిర్మాణాలను తొలగించి, నిర్వాసితులకు పునరావాసం కింద వీటిని ఇవ్వనున్నారు. ఇప్పటికే నిర్వహించిన సర్వే ప్రకారం 10,200 మంది నిర్వాసితులు కానున్నట్లు అధికారులు గుర్తించారు. ముందుగా మూసీ రివర్ బెడ్​లో ఉన్న 1600 నిర్మాణాలను తొలగించి అక్కడ ఉన్న వారిని తరలిస్తారు.

మూసీ బఫర్ జోన్​లో నివసిస్తున్న వారికి భూసేకరణ, పునరావాస చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణ ఖర్చులతో పాటు పట్టా ఉంటే భూమి విలువను చెల్లించడంతో పాటు డబుల్ బెడ్ రూం ఇంటిని ఇవ్వనున్నారు. నిర్వాసితులను సంప్రదించి పునరావాసం కల్పించే ప్రక్రియను కలెక్టర్లు బుధవారం ప్రారంభించనున్నారు. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌ జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారుల బృందాలు బుధవారం ఇంటింటికి వెళ్లి అక్కడున్న ప్రజలకు, ఎక్కడెక్కడ డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించారో వివరిస్తారు.

చెరువుల వద్ద సీసీ కెమెరాలు : చెరువులు, నాలాల ఆక్రమణల పరిధిలో ఉన్న పేదల వివరాలు కూడా సేకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అవుటర్ రింగు రోడ్డు వరకు చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్న సీఎం, కబ్జా కాకుండా పర్యవేక్షించేందుకు చెరువుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

దసరాలోపు మెట్రో విస్తరణ రూట్‌కు డీపీఆర్‌ను సిద్ధం చేయండి : ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గంపై నివేదిక తయారు చేయాలని అధికారులకు సీఎం రేవంత్​రెడ్డి కోరారు. ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణ పనులు వేగంగా చేపట్టాలని పేర్కొన్నారు. మెట్రో మార్గాలకు భూసేకరణ, ఇతర అడ్డంకులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని తెలిపారు. దసరాలోపు మెట్రో విస్తరణ రూట్‌కు డీపీఆర్‌ను సిద్ధం చేసి కేంద్రానికి పంపాలని సీఎం అధికారులను అదేశించారు.

CM Revanth Check Presented to Deepthi : మరోవైపు పారా ఒలంపిక్ కాంస్య పతక విజేత దీప్తి జీవాన్జికి కోటి రూపాయలు, ఆమె కోచ్ నాగపురి రమేశ్​కు పది లక్షల రూపాయల చెక్​ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ తరఫున ఈ చెక్కులను సీఎం అందించారు. నిబంధనలను సడలించి నగదు ప్రోత్సాహకాన్ని అందజేశామని, రాష్ట్రానికి కీర్తి తెచ్చే క్రీడాకారులకు గతంలో లేనటువంటి ప్రోత్సాహకాలు అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. క్రీడలకు పెద్దపీట వేస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ కే శివసేనారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. క్రీడారంగంలో సమూల మార్పులు జరుగుతున్నాయని, గ్రామీణ క్రీడా రంగానికి పెద్దపీట వేస్తూ, మట్టిలో మాణిక్యాల లాంటి క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహిస్తామమని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో వన్ స్టేట్, వన్ డిజిటల్ కార్డులు - త్వరలోనే పైలెట్ ప్రాజెక్ట్​ ప్రారంభం - CM REVANTH REVIEW MEET

పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఐటీఐ, పాలిటెక్నిక్​ల సిలబస్​ : సీఎం రేవంత్ - CM Revanth On Govt ITI

Last Updated : Sep 24, 2024, 9:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.