ETV Bharat / snippets

మాజీ సర్పంచ్​పై రూ. 4కోట్ల అవినీతి ఆరోపణలు - ఎక్కడంటే?

EX SARPANCH CORRUPTION
PEOPLE PROTEST IN FRONT OF POLICE STATION (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 24, 2024, 6:47 PM IST

NIZAMABAD EX SARPANCH CORRUPTION: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం సుర్బిర్యాల్ గ్రామ మాజీ సర్పంచ్ సట్లపల్లి సవిత దాదాపు రూ. 4కోట్ల అవినీతికి పాల్పడిందని గ్రామస్థులు ఆరోపించారు. సవిత అవినీతిపై విచారణ జరిపించాలని సుర్బిర్యాల్ గ్రామస్తులు సుమారు 200 మంది ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. మాజీ సర్పంచ్ అధికారంలో ఉండగా చేయని పనులను చేసినట్లు బిల్లులను సృష్టించి మరి అవినీతికి పాల్పడిందని వారు ఆరోపించారు. సుర్బిరియల్ గ్రామస్తులు ఆర్మూర్ పోలీస్​స్టేషన్ ఎదుట నిరసనకు దిగిన విషయం తెలుసుకున్న ఆర్మూర్ డీసీపీ బస్వ రెడ్డి పోలీస్ స్టేషన్​కు వచ్చారు. ఈ సందర్భంగా సుర్బిర్యల్ గ్రామపంచాయతీలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ప్రజల నుండి వచ్చాయన్నారు. వీరిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయమై రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారని తెలిపారు. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకోరాదని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.