ETV Bharat / politics

అల్లుడి కోసం కొడంగల్​ను బలిపెట్టే పరిస్థితి తలెత్తింది : కేటీఆర్‌

అమృత టెండర్లలో అక్రమాలు జరిగాయని కేంద్రమంత్రి మనోహర్​ లాల్​ ఖట్టర్​ ఫిర్యాదు చేసిన కేటీఆర్ - రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టెండర్లు రద్దు చేయాలని వినతి

KTR
KTR (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 12, 2024, 12:41 PM IST

Updated : Nov 12, 2024, 1:04 PM IST

KTR Spoke on AMRUT Tenders : 'ఫిబ్రవరిలో అమృత్​ 2.0 పథకం కింద టెండర్లు పిలిచారు. రాష్ట్రంలో 8 ప్యాకేజీల కింద అమృత్ పథకం టెండర్లను పిలిచారు. మొత్తం రూ.8,888 కోట్లకు పైగా వ్యయంతో టెండర్లు పిలువగా.. ఈ వివరాలు వెబ్​సైట్​లో లేవు. సీఎం బావమరిది కంపెనీ శోధ కన్​స్ట్రక్షన్​కు భారీ పనులు అప్పగించారు. రూ.1,137 కోట్లకు సంబంధించిన పనులు శోధ కంపెనీకి ఇచ్చారు. 2021-22లో శోధ కన్​స్ట్రక్షన్స్​ నికర ఆదాయం రూ.2.2 కోట్లు మాత్రమే. ఎలాంటి అర్హత లేని చిన్న కంపెనీకి భారీ పనులు అప్పగించారు. టెండర్ల విషయమై కేంద్రమంత్రి మనోహర్​లాల్​ ఖట్టర్​కు ఫిర్యాదు చేశాను. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టెండర్లు రద్దు చేయాలని కేంద్రమంత్రిని కోరాను. అమృత పథకం టెండర్ల విషయమై విచారణ చేపట్టాలని కోరినట్లు' బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ తెలిపారు. దిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎంపీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్​పై ప్రధాని ఆరోపణలు చేశారని కేటీఆర్​ గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆర్​ఆర్​ ట్యాక్స్​ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​కు తెలంగాణ ఏటీఎంలా మారిందని ధ్వజమెత్తారు. రాహుల్​, రేవంత్​ ట్యాక్సు వసూలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో తప్పులు జరుగుతున్నాయని ఆధారాలతో వివరాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. అమృత్ పథకంలో స్కామ్​ జరుగుతుంటే కేంద్రం ఏం చేస్తోందని నిలదీశారు.

కేంద్రం సీరియస్​గా తీసుకోవాలి : కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రధానిని ప్రశ్నిస్తున్నానని కేటీఆర్​ పేర్కొన్నారు. కాంగ్రెస్​ తెలంగాణను ఏటీఎంలా మార్చిందనేది నిజమైతే విచారణ చేపట్టాలని డిమాండ్​ చేశారు. అమృత్​ పథకం పనులు మంత్రి శ్రీనివాస్​రెడ్డి సంస్థలకు కూడా కట్టపెట్టారని తెలిపారు. సొంత వర్గానికి పనులు అప్పగించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కేంద్రం తమ ఆరోపణలను సీరియస్​గా తీసుకుంటుందని భావిస్తున్నానని చెప్పారు.

అమృత్​ పథకం కుంభకోణంపై విచారణ జరిపించాలని కేటీఆర్​ కోరారు. దిల్లీకి రేవంత్​ రెడ్డి పలుమార్లు వెళ్లి వస్తున్నారని అన్నారు. దిల్లీ నుంచి 26 పైసలు కూడా తెలంగాణకు రాలేదని ఎద్దేవా చేశారు. అల్లుడి కోసం కొడంగల్​ను బలిపెట్టే పరిస్థితి తలెత్తిందని అన్నారు. అందుకే కొడంగల్​లో తిరుగుబాటు మొదలైందని కేటీఆర్​ అన్నారు. అస్మదీయులకు లబ్ధి చేకూర్చారని ఝార్ఖండ్ సీఎంపై కేసు పెట్టారని తెలిపారు.

ప్రధాన ప్రతిపక్షంగా మేం దిల్లీ వస్తాం : రాష్ట్రంలోనూ అదే జరిగితే రేవంత్​ రెడ్డి, పొంగులేటిపై ఎందుకు కేసు పెట్టట్లేదని కేటీఆర్​ ప్రశ్నించారు. ఆఫీస్​ ఆఫ్​ ప్రాఫిట్​ కింద సోనియా, అశోక్​ చవాన్​ పదవి వదులుకున్నారని గుర్తు చేశారు. రేవంత్​ రెడ్డి, పొంగులేటి కూడా పదవులు వదులుకోవాల్సి వస్తుందన్నారు. రాష్ట్రంలో బడా కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్​ రెడ్డి దిల్లీకి 26 సార్లు తిరిగినా 26 పైసలు తీసుకురాలేదని అన్నారు. మరి బీఆర్​ఎస్​ నేతలు దిల్లీకి ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నిస్తున్నారని అంటున్నారని తెలిపారు. ప్రధాన ప్రతిపక్షంగా మేం కచ్చితంగా దిల్లీకి వెళ్తామని చెప్పుకొచ్చారు.

జైల్లో పెడితే యోగా చేసి పాదయాత్రకు సిద్ధమౌతా : కేటీఆర్​

'కేసీఆర్ చేసిన అప్పుల్లో ఎక్కువ భాగం వాటికే ఖర్చు చేశారు - అవన్నీ తప్పుడు ఆరోపణలు'

Last Updated : Nov 12, 2024, 1:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.