ETV Bharat / entertainment

ముంబయిలో నాకున్న ఏకైక ఫ్రెండ్‌ ఆలియా! ఆమె తర్వాతనే ఆ హీరో పరిచయం : స్పెషల్‌ చిట్‌చాట్‌లో తారక్​ - Jr NTR Devara Promotions - JR NTR DEVARA PROMOTIONS

Devara Special Interview : 'దేవర' రిలీజ్ దగ్గర పడుతున్న తరుణంలో జూనియర్ ఎన్​టీఆర్ ఈ మూవీ ప్రమోషన్స్​లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తన కో స్టార్ ఆలియా భట్​తో 'దేవర X జిగ్రా' అనే ఓ స్పెషల్‌ చిట్‌చాట్‌లో పాల్గొన్నారు తారక్. ఆ విశేషాలు మీ కోసం.

Devara Special Interview
Devara Special Interview (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 24, 2024, 7:33 PM IST

Devara Special Interview : టాలీవుడ్‌ స్టార్‌ హీరో జూనియర్ ఎన్​టీఆర్​ సోలో మూవీ రిలీజ్‌ అయి చాలా కాలం అయిపోయింది. దీంతో సెప్టెంబర్‌ 27న రిలీజ్‌ కాబోతున్న దేవర: పార్ట్‌ 1 కోసం ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పాన్‌ ఇండియా లెవెల్​లో రిలీజ్‌ అవుతున్న ఈ మూవీకి సౌత్​లోనే కాకుండా నార్త్​లోనూ బాగా ప్రమోషన్స్‌ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తన కో స్టార్ ఆలియా భట్​ ఓ స్పెషల్‌ చిట్‌చాట్‌లో పాల్గొన్నారు తారక్. 'దేవర x జిగ్రా' అనే పేరుతో టెలికాస్ట్ అయిన ఈ ప్రోగ్రామ్​కు ప్రముఖ డైరెక్టర్ కరణ్‌ జోహార్‌ హోస్ట్‌గా వ్యవహరించారు. ఇక ఎన్​టీఆర్​ కూడా ఈ ఈవెంట్​లో తన అప్​కమింగ్ మూవీ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు.

ఆమె మాత్రమే నా ఫ్రెండ్
సినిమా గురించి ముచ్చటిస్తున్న సమయంలో తారక్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ముంబయిలో తనకు మొట్ట మొదట ఫ్రెండ్‌ అయింది ఆలియా మాత్రమేనని చెప్పారు. "స్నేహతులు అంటే ముంబయిలో ఆలియా తప్ప నాకు వేరెవరు గుర్తుకురారు. ఆమె తర్వాతనే నాకు రణ్‌బీర్‌ పరిచయం అయ్యారు. రణ్‌బీర్‌, నేను స్నేహితులు కాదు. ముందు నేను ఆలియా ఫ్రెండ్స్‌ అయ్యాం ఆ తర్వాతనే ఆయన వచ్చారు." అని తారక్ సరదాగా అన్నారు.

2 మిలియన్ మార్క్​ - ఓవర్సీస్​ తారక్ నయా రికార్డు
బ్యాక్ టు బ్యాక్ రికార్డులతో ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ క్రియేట్ చేస్తున్న 'దేవర' తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. రీసెంట్​గా 2 మిలియన్ డాలర్స్ గ్రాస్​ని నార్త్ అమెరికా మార్కెట్​లో ఈ ఘనత సాధించిన రెండో హీరోగా ఎన్​టీఆర్​ను నిలిపింది. ఇప్పటికే ఈ లిస్ట్​లో 'సలార్', 'కల్కి 2898 ఏడీ' చిత్రాలతో ప్రభాస్ టాప్​లో ఉన్నారు.

Devara Movie Cast : ఇక 'దేవర' సినిమా విషయానికి వస్తే ఈ చిత్రంలో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్​గా నటిస్తోంది. సీనియర్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్​గా నటించనున్నారు. ఈ సినిమాలో ఎన్​టీఆర్ డ్యుయల్ రోల్​లో కనిపించనున్నారు. శ్రీకాంత్, శ్రుతి మారాఠే, చైత్ర రాయ్, షైన్ టామ్, మురళీ శర్మ, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ తదితరులు నటించారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీంతం అందించగా, రత్నవేలు డీఓపీ బాధ్యతలు చూశారు. ఎన్​టీఆర్, యువసుధ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందించింది.

'దేవర' బుకింగ్స్ షురూ - తారక్ ఫ్యాన్స్ హర్రీ అప్

హాలీవుడ్​లో 'దేవర' స్క్రీనింగ్ - USలోనూ సినిమాకు ఫుల్ క్రేజ్! - Devara Screening At Los Angeles

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.