Boxer Nikhat Zareen Appointed as DSP : తెలంగాణకు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు జాయినింగ్ ఆర్డర్‌ను డీజీపీకి అందజేశారు. రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించారు. ఏషియన్ గేమ్స్‌లోనూ రతజ పతకం సాధించారు. ఇటీవల జరిగిన ప్యారిస్ ఒలంపిక్స్‌లోనూ పాల్గొన్నారు.
డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన బాక్సర్ నిఖత్ జరీన్
Published : Sep 18, 2024, 9:29 PM IST
Boxer Nikhat Zareen Appointed as DSP (ETV Bharat)
ఇటీవల తెలంగాణ కేబినెట్ సమావేశంలో నిఖత్ జరీన్‌కు డీఎస్పీ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ స్పెషల్ పోలీసు విభాగంలో డీఎస్పీగా ఉద్యోగం ఇస్తూ హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరిస్తూ నిఖత్ జరీన్ జాయినింగ్ ఆర్డర్‌ను డీజీపీకి అందజేశారు. ఈ సందర్భంగా డీజీపీ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.