బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తివేత - ఎస్సారెస్పీలోకి నీరు
Published : Jul 1, 2024, 12:59 PM IST
Babli Project Gates Lifted : మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను తెరిచారు. కేంద్ర జల సంఘం అధికారులు, తెలంగాణ, మహారాష్ట్ర అధికారుల సమక్షంలో 14 గేట్లు పూర్తిగా ఎత్తారు. గేట్ల ఎత్తివేతతో నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి వద్ద నీరు రాష్ట్రంలోకి ప్రవేశించి దిగువన ఉన్న శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు వైపు ప్రవహిస్తుంది. గేట్లు తెరిచిన నేపథ్యంలో నది పరివాహక ప్రాంతాల్లోని రైతులు, పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, పోలీసులు సూచించారు. కేంద్ర జల వనరుల సంఘం ఒప్పందం మేరకు ప్రాజెక్టు గేట్లను ప్రతి ఏటా జులై 1న తెరుస్తారు. 120 రోజుల పాటు ఈ గేట్లు తెరిచి ఉంటాయి. తిరిగి అక్టోబరు 29న మూసివేస్తారు.