ETV Bharat / spiritual

కార్తిక దీపం ఆ మూడు ప్రాంతాల్లో వెలిగించాలి - అవేంటో మీకు తెలుసా? - KARTHIKA MASAM 2024

- ఇలా దీపం వెలిగిస్తే భగవంతుడి ఆశీర్వాదం మీ వెంటే!

Karthika Masam Deepam
How to light Karthika Masam Deepam (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 8, 2024, 11:32 AM IST

How to light Karthika Masam Deepam : శివకేశవులిద్దరికీ పరమ పవిత్రమైన, ప్రీతిపాత్రమైన మాసం ఈ కార్తికం. హిందూ సంప్రదాయంలో ఈ నెలను ఆధ్యాత్మిక సాధనకు, మోక్షసాధనకు విశిష్టమైనదిగా భావిస్తారు. చాలా మంది ఈ మాసంలో స్నానం, దానం, జపం, ఉపవాసం, దీపారాధన, దీప దానం వంటివి చేయడానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఈ క్రమంలోనే అందరూ శివాలయం, విష్ణు దేవాలయాల్లో దీపాలు వెలిగిస్తుంటారు. అయితే కార్తిక మాసంలో కొన్ని నియమాలు పాటిస్తూ దీపాలు వెలిగించడం వల్ల దేవుడి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని, ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని, కోరికలు నెరవేరతాయని ప్రముఖ జ్యోతిష్యుడు 'మాచిరాజు కిరణ్ కుమార్' చెబుతున్నారు. ఏ ఆలయాల్లో దీపాలను ఏ విధంగా వెలిగించాలో ? ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కార్తిక మాసంలో శివాలయంలో దీపాలు వెలిగించే విధానం..

ఈ కార్తిక మాసంలో చాలా మంది సాయంత్రం వేళల్లో శివాలయాల్లో దీపాలు వెలిగిస్తుంటారు. అయితే, ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించేటప్పుడు మూడు చోట్ల తప్పకుండా దీపాలు వెలిగించాలి. ఆ మూడు ప్రదేశాల్లో మొట్టమొదటి ప్రదేశం గోపుర ద్వారం. మీరు ఆలయానికి వెళ్లగానే గోపురం కనిపిస్తుంది. అక్కడ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపం వెలిగించాలి. ఆ తర్వాత నందీశ్వరుడి దగ్గర దీపం వెలిగించాలి. ఆ తర్వాత మూడవ ప్రదేశం గర్భగుడిలో ఈశ్వరుడికి వీలైనంత సమీపంలో దీపం వెలిగించాలని స్కంధపురాణంలో చెప్పారు.

కార్తిక మాసంలో విష్ణు ఆలయంలో దీపాలు వెలిగించే విధానం..

కార్తిక మాసంలో విష్ణు ఆలయంలో దీపాలు వెలిగించేటప్పుడు ప్రత్యేక విధివిధానం పాటించాలి. దాదాపు అందరూ విష్ణు ఆలయంలో మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపం వెలిగించడం మనం చూస్తుంటాం. కానీ, ఇలా దీపం వెలిగించిన తర్వాత అక్కడ కొన్ని అవిసె పుష్పాలు ఉంచాలి.

అయితే.. మీకు అవిసె పుష్పాలు అందుబాటులో లేకపోతే ఇలా చేయండి. ఆ దీపం దగ్గర తమలపాకులో కొద్దిగా నువ్వులు లేదా బియ్యం, ధాన్యం నైవేద్యంగా ఉంచాలి. ఇటువంటి దీపాన్ని 'నందా దీపం' అని అంటారు. ఈ దీపం చాలా శక్తి వంతమైనది. సాధ్యమైనంత వరకు పెద్ద ప్రమిదలో దీపం వెలిగించి త్వరగా దీపం కొండెక్కకుండా చూసుకోండి. ఇలా నందా దీపం వెలిగిస్తే విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది.

శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, నరసింహ స్వామి, వేంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధితమైన ఏ ఆలయంలోనైనా సరే నందా దీపం వెలిగించాలని మాచిరాజు కిరణ్​ కుమార్​ సూచిస్తున్నారు.

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

కార్తిక మాసంలో నారికేళ దీపాన్ని ఇలా వెలిగిస్తే - ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయట!

కార్తిక మాసంలో ఈ రోజుల్లో ఇలా "ధనదీపం" వెలిగించండి - ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ధనవంతులవ్వడం పక్కా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.