national

శిక్షణ జవాన్ గన్​ గురితప్పింది

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 30, 2024, 10:05 PM IST

Gun misfire in army training center
Gun misfire in army training center (ETV Bharat)

Gun Firing At Narsingi Army Training Center : తెలంగాణ రంగారెడ్డి జిల్లా నార్సింగి గంధంగూడలో తుపాకీ మోత కలకలం రేపింది. ఆర్మీ శిక్షణ కేంద్రంలో జవాన్లు ఫైరింగ్ చేసిన బుల్లెట్​ సమీపంలోని ఓ ఇంట్లోకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న మహిళ కాలులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఆ మహిళ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. గమనించిన ఇంట్లో వాళ్లు స్థానికుల సాయంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న నార్సింగి పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆర్మీ రేంజ్‌లో జవాన్లు ఫైరింగ్ చేస్తుండగా ఘటన జరిగినట్లు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు. కాగా ఈ నెలలోనే ఇది రెండో ఘటన కావటం గమనార్హం.

ABOUT THE AUTHOR

...view details