ETV Bharat / snippets

స్కూల్​కు వెళ్లాలంటే పడవ ఎక్కాల్సిందే - ప్రమాదకరంగా విద్యార్థుల ప్రయాణం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 15 hours ago

STUDENTS PROBLEMS WITH RAINS
STUDENTS PROBLEMS WITH RAINS (ETV Bharat)

Students Problems Due to Rains in Eluru District : వర్షాకాలం వచ్చిందంటే ఏలూరు జిల్లాలోని కొల్లేరు లంక గ్రామాల ప్రజల రాకపోకలకు పడవలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఏలూరు గ్రామీణ మండలం కోమటిలంక నుంచి ఆటపాక, కైకలూరులలోని స్కూల్, కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు ప్రమాదకర పడవ ప్రయాణం తప్పడం లేదని వాపోతున్నారు. 700 పైగా జనాభా ఉన్న కోమటిలంక నుంచి నిత్యం సరకులు తెచ్చుకోవాలన్నా, ఆసుపత్రికి వెళ్లాలన్నా పడవ మార్గమే శరణ్యం. పోలారాజ్ కెనాల్​పై వంతెన నిర్మిస్తామని గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చలేదని స్థానికులు వాపోతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కొద్ది రోజులు రాకపోకలు నిలిచాయని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశాలతో పడవను అధికారులు ఏర్పాటు చేశారని తెలియజేశారు. ఇప్పుడైనా అధికారులు స్పందించి వంతెన నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.