25 Naxalites Surrender In Bijapur: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో 25 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. బైరాంఘడ్, గంగులూరు ఏరియా కమిటీలకు చెందిన ఎల్ఓఎస్ సభ్యుడు, సీఎన్ఎం ప్రెసిడెంట్ సహా 25 మంది మావోయిస్టులు బీజాపూర్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ఐదుగురి తలలపై మొత్తంగా రూ.28లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఛత్తీస్‌గఢ్‌లో 25మంది నక్సలైట్ల లొంగుబాటు - ఐదుగురి తలలపై రూ.28లక్షల రివార్డు
25 Naxalites Surrender In Bijapur (ETV Bharat)
Published : Aug 26, 2024, 7:03 PM IST
ఎల్ఓఎస్ సభ్యుడు, సీఎన్ఎం ప్రెసిడెంట్ వీరిద్దరిలో ఒక్కొక్కరిపై రూ. 8 లక్షల రివార్డు ఉన్నట్లు బీజాపూర్ పోలీసులు వెల్లడించారు. తాము ప్రవేశపెట్టిన పునరావాస విధానం, నియాద్ నెలనార్ అనే పథకాలకు ఆకర్షితులై మావోయిస్టులు లొంగిపోతున్నారని పోలీసులు పేర్కొన్నారు. బీజాపూర్ జిల్లాలో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 170మంది లొంగిపోగా 346 మంది నక్సలైట్లు అరెస్టయినట్లు పోలీసులు తెలిపారు.