national

వినేశ్ అదుర్స్ - వరల్డ్ నెం.1 బెదుర్స్ - కెరీర్​లోనే పెద్ద ఝలక్ ఇచ్చిందిగా!

By ETV Bharat Sports Team

Published : Aug 6, 2024, 6:31 PM IST

Vinesh Phogat Olympics
Vinesh Phogat Olympics (Source: Getty Images)

Vinesh Phogat Olympics:పారిస్ ఒలింపిక్స్​లో భారత స్టార్ రెజ్లర్ అదిరే శుభారంభం చేసింది. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో రెజ్లింగ్ (50కేజీల) ఈవెంట్​ సెమీస్​కు దూసుకెళ్లింది. తొలుత ప్రీ క్వార్టర్స్​లో వరల్డ్ నెం.1 సుసాకీ (జపాన్)ను ఎదుర్కొన్న వినేశ్ అద్భుతంగా పోరాడింది. తొలుత 0-2తో వెనుకబడ్డా, తర్వాత పుంజుకుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సునాకీని 3-2తో ఓడించి క్వార్టర్స్​కు అర్హత సాధించింది.

తొలిసారి: నాలుగుసార్లు ప్రపంచఛాంపియన్ సుసాకీకి వినేశ్ ప్రీ క్వార్టర్స్​లో షాకిచ్చింది. ఈ మ్యాచ్​కు ముందు 82మ్యాచ్​ల్లో సుసాకీకి ఓటమి లేదు. ఇంటర్నేషనల్​ కెరీర్​లో 10ఏళ్లుగా పరాజయంలేని సుసాకీకి వినేశ్ తొలిసారి ఓటమి రుచి చూపించింది. అలాగే సుసాకీని ఓడించిన తొలి భారత రెజ్లర్​గా నిలిచింది.

గంట వ్యవధిలోనే క్వార్టర్స్​ ఆడిన వినేశ్ అందులోనూ అదరగొట్టింది. లివచ్‌ ఒక్సానా (ఉక్రెయిన్‌)పై 7-5 తేడాతో నెగ్గి ఒలింపిక్స్​లో తొలిసారి సెమీస్​కు దూసుకెళ్లింది. మంగళవారం రాత్రి జరిగనున్న సెమీస్​లో యుస్నీలిస్ లోపెజ్‌ (క్యుబా)తో వినేశ్ తలపడనుంది.

ABOUT THE AUTHOR

...view details