ETV Bharat / snippets

వరల్డ్​కప్​ వల్ల భారత్​కు భారీ ఆదాయం- ఏకంగా రూ.11,637 కోట్లు వచ్చాయట!

author img

By ETV Bharat Sports Team

Published : Sep 11, 2024, 6:40 PM IST

2023 World Cup India Economy
2023 World Cup India Economy (Source: ETV Bharat File Photo)

2023 World Cup India Economy: 2023 వన్డే వరల్డ్​కప్​న​కు ఆతిథ్యం ఇవ్వడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు భారీ ఆదాయం చేకూరింది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ వల్ల భారత్​కు రూ. 11,637 కోట్ల ఆదాయం సమకూరిందని ఐసీసీ తాజాగా వెల్లడించింది. మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చిన నగరాల్లో టూరిజం, వసతి, ప్రయాణం, రవాణా, ఆహారం, పానీయాల అమ్మకాల ద్వారా 861.4 మిలియన్‌ డాలర్ల ఆదాయం వచ్చినట్లు తెలిపింది. ప్రపంచకప్ వల్ల ఆతిథ్య రంగంలో ప్రత్యక్షంగా సుమారు 48,000 కంటే ఎక్కువమంది పార్ట్ టైమ్, ఫుల్ టైమ్‌ ఉద్యోగావకాశాలు పొందారని ఐసీసీ పేర్కొంది. దీంతోపాటు మీడియా రైట్స్, స్పాన్సర్​షిపర్ డీల్స్ వల్ల బీసీసీఐకి కూడా భారీగా ఆదాయం వచ్చింది.

కాగా, మెగా టోర్నీలో మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించడానికి అనేక దేశాల అభిమానుల భారత్‌కు పోటెత్తారు. ఈ టోర్నీలో వరుస విజయాలతో ఫైనల్‌కు చేరిన టీమ్‌ఇండియా టైటిల్ ఫైట్​లో ఆస్ట్రేలియాతో ఓడింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.