national

ETV Bharat / snippets

'స్టాఫ్​ ప్రైజ్​మనీ తక్కువైంది- నా బోనస్ వాళ్లకు ఇచ్చేయండి!'

By ETV Bharat Telugu Team

Published : Jul 11, 2024, 2:33 PM IST

Rohit Sharma Prize Money
Rohit Sharma Prize Money (Source: Associated Press)

Rohit Sharma Prize Money:టీమ్ఇండియా సపోర్టింగ్ స్టాఫ్​కు దక్కిన​ వరల్డ్​కప్ ప్రైజ్​మనీ విషయంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించినట్లు తెలుస్తోంది. స్టాఫ్​కు దక్కిన రూ.2.5 కోట్ల ప్రైజ్​మనీ తక్కువైందని భావించిన రోహిత్, వాళ్ల కోసం తన బోనస్​ను సైతం వదులుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. 'సపోర్టింగ్ స్టాఫ్​కు ప్రైజ్​మనీ అంత తక్కువ రాకూడదు. కావాలంటే నా బోనస్ వదులుకుంటాను. అది వాళ్లకు ఇవ్వండి' అని బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లాడని ఓ స్టాఫర్ వెల్లడించాడు. దీంతో రోహిత్ శర్మను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

కాగా, మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా తనకు దక్కిన బోనస్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. బీసీసీఐ ఆఫర్ చేసిన ఈ బోనస్​ను రాహుల్ సున్నితంగా తిరస్కరించాడని సమాచారం. రూ.5కోట్లు కాకుండా, తనకు కూడా సపోర్టింగ్ స్టాఫ్​కు దక్కినంతే (రూ.2.5 కోట్లు) తీసుకోవాలని రాహుల్ డిసైడ్ అయ్యాడట. మరి ఈ విషయంపై అఫీషియల్​గా ఎలాంటి ప్రకటన రాలేదు.

ABOUT THE AUTHOR

...view details