ETV Bharat / health

వెయిట్ చెక్ చేసుకుంటే బరువు తగ్గుతారట! వారంలో ఎన్ని సార్లు చూసుకోవాలి?

బరువు తగ్గాలనుకునేవారు.. వ్యాయామాలు చేయటం, ఆహార నియమాలు పాటించడం చేస్తుంటారు. అయితే, అవి ఫాలో అవ్వడం మాత్రమే కాదు.. వారంలో ఎన్ని రోజులు బరువు చెక్ చేసుకోవాలో కూడా తెలిసి ఉండాలంటున్నారు నిపుణులు.

TIPS FOR WEIGHT LOSS
Weight Loss Tips (ETV Bharat)
author img

By ETV Bharat Health Team

Published : Oct 8, 2024, 5:24 PM IST

Weight Loss Tips : ప్రస్తుత రోజుల్లో బరువు పెరగడం అనేది ప్రధాన సమస్యగా మారింది. ముఖ్యంగా మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలతో ఎంతో మంది అధిక బరువు పెరిగిపోతున్నారు. ఫలితంగా చిన్న వయసులోనే వివిధ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే అధిక బరువు సమస్యను తగ్గించుకొని ఫిట్​గా మారడానికి ఒక్కొక్కరూ ఒక్కో ప్రయత్నం చేస్తుంటారు. అందులో ముఖ్యంగా చాలా మంది డైటింగ్‌, చక్కటి పోషకాహారం తీసుకోవడం, వ్యాయామాలు చేయడం.. వంటివి ఫాలో అవుతుంటారు. అయితే, బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉండేవాళ్లు.. మంచి ఫలితం రావాలంటే వాటిని ఫాలో అవ్వడమే కాకుండా తరచుగా ఎన్నిసార్లు బరువు చూసుకోవాలి? అనే విషయంపై కూడా సరైన అవగాహన కలిగి ఉండాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఓ రీసెర్చ్​లో వారంలో ఎన్ని రోజులు బరువు చూసుకుంటే ఎలాంటి ఫలితం ఉంటుందో కనుగొన్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉండేవాళ్లు.. ఎంత తరచుగా బరువుని చెక్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందనే అంశంపై యూనివర్సిటీ ఆఫ్‌ ఫ్లోరిడా, యూనివర్సిటీ ఆఫ్‌ వర్జీనియా ఉమ్మడిగా ఓ అధ్యయనం చేపట్టాయి. ఈ సమయంలో అధిక బరువు లేదా ఊబకాయం సమస్యతో బాధపడుతున్న 74 మందిపైన పరిశోధన చేశారు. ఒక వెయిట్‌లాస్‌ ప్లాన్‌ను మూడు నెలలపాటు పాటించిన సమయంలో, ఆపైన తొమ్మిది నెలలపాటు ఆ బరువుని కొనసాగించే ప్రయత్నంలో ఉన్నప్పుడు వారిని పర్యవేక్షించారు.

40 ఏళ్లు దాటాక బరువు తగ్గాలా? - ఇలా చేస్తే సింపుల్​గా వెయిట్​ లాస్​ కావొచ్చంటున్న నిపుణులు!

అయితే, ఈ పరిశోధన సమయంలో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఆహార నియమాల్ని ఫాలో అవుతూ, వ్యాయామాల్ని చేస్తూ.. వారంలో మూడు రోజులైనా కచ్చితంగా వెయిట్ చెక్ చేసుకునేవాళ్లు బరువు పెరగకుండా ఉన్నారట. అలాగే.. వారంలో ఐదు రోజులు బరువు చూసుకున్నవాళ్లు కాస్త వెయిట్ తగ్గారట. అదేవిధంగా.. వారంలో ఒకట్రెండు రోజులే వెయిట్ చెక్ చేసుకున్నవాళ్లు మాత్రం తిరిగి బరువు పెరిగారట. కాబట్టి.. బరువు తగ్గాలనుకునేవారు ఆహార నియమాలు, వ్యాయమాలు చేయడం మాత్రమే కాకుండా.. వెయిట్ చెక్ చేసుకోవడం కూడా ముఖ్యమనే విషయాన్ని గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు.

వీటితో పాటు బరువు తగ్గాలనుకునేవారు మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అందులో ముఖ్యంగా.. అధిక చక్కెర ఉండే ఆహారాలు, పానీయాలకు దూరంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే.. జంక్ ఫుడ్, ప్రాసెస్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్​కు వీలైనంత దూరంగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. రోజూ తగినంత వాటర్ తాగుతూ బాడీని హైడ్రేటెడ్​గా ఉంచుకోవాలంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఆశ్చర్యం : బరువు తగ్గడానికి బంగాళాదుంపలు! - నిపుణులు చెబుతున్నది ఇదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.