India Women vs South Africa Women :దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమ్ఇండియా మహిళలజట్టు ఓడిపోయింది. దీంతో 12 పరుగుల తేడాతో సౌతాఫ్రికా గెలుపొందింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది దక్షిణాఫ్రికా. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 177 స్కోర్ మాత్రమే చేసింది. స్మృతి(46), హర్మన్‌ప్రీత్ కౌర్(35), చివర్లో వచ్చిన జెమీ రోడ్రిగ్స్(53నాటౌట్) రాణించారు.
తొలి టీ20లో భారత్ అమ్మాయిలపై దక్షిణాఫ్రికా విజయం
Published : Jul 5, 2024, 10:24 PM IST
India Women vs South Africa Women (source ANI)
అంతకుముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల కోల్పోయి 189 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ తజ్మిన్‌బ్రిట్స్ (56 బంతుల్లో 81; 10×4, 3×6), మారిజన్నె (33 బంతుల్లో 57; 8×4, 1×6) రాణించారు. కెప్టెన్ వోల్వార్ట్ (33) కీలక ఇన్నింగ్స్‌తో రాణించగా ట్రయాన్ 12 పరుగులు చేసింది. భారత్ బౌలర్లలో పూజా వస్త్రాకర్, రాధా యాదవ్ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు.