national

పారిస్​ ఒలింపిక్స్​ - పీవీ సింధు చీరపై విమర్శలు - ఎందుకంటే?

By ETV Bharat Telugu Team

Published : Jul 27, 2024, 1:06 PM IST

source Associated Press
Paris Olympics PvSindhu Saree (source Associated Press)

Paris Olympics PvSindhu Saree : పారిస్​ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకల్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించే అరుదైన గౌరవాన్ని అందుకుంది. భారత సంప్రదాయ చీరలో మెరిసింది. తెలుపు రంగుపై త్రివర్ణ పతాకంలోని మరో రెండు వర్ణాలతో రూపొందించిన చీరను ధరించి ఆకట్టుకుంది. అలానే భారత పతాకాన్ని చేతబూని భారత అథ్లెట్ల బృందానికి నాయకత్వం వహించింది. తన జీవితంలో ఇంతకన్నా గొప్ప గౌరవం మరేదీ లేదంటూ హర్షం వ్యక్తం చేసింది. అయితే సింధు ధరించిన చీరపై విమర్శలు వచ్చాయి. తరుణ తహిలియానీ డిజైన్‌ చేసిన ఈ డ్రెస్​లు చాలా చీప్​గా ఉన్నాయంటూ బెంగళూరుకు చెందిన రచయిత డాక్టర్ నందితా అయ్యర్ పోస్ట్‌ పెట్టారు. మీరు డిజైన్ చేసిన ఈ వేడుకల యూనిఫామ్‌ల కన్నా మెరుగైన చీరలు రూ.200లకు ముంబయి వీధుల్లో నేను చూశాను. చౌకైన పాలిస్టర్, ఇకత్‌ ప్రింట్‌((!!!)తో దారుణంగా ఉందంటూ విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details